Pooja Hegde:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) తొలిసారి ‘ఒక లైలా కోసం’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటించారు. మొదటి సినిమాతోనే పరవాలేదనిపించింది ఈమె. ఆ తర్వాత పలువురు యంగ్ హీరోల సినిమాలలో నటించి ఆకట్టుకుంది. అంతేకాదు ప్రభాస్(Prabhas ), మహేష్ బాబు(Maheshbabu) లాంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో అమాంతం తన మార్కెట్ ను పెంచేసుకుంది. తెలుగులో ఎంత త్వరగా అయితే మార్కెట్ వచ్చిందో.. అంతే త్వరగా ఫేమ్ కూడా పోయిందని చెప్పవచ్చు. దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదు. తెలుగు సౌత్ సినిమాలలో కూడా అవకాశం లేకపోవడంతో ఇక పూజా హెగ్డే సౌత్ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పింది అనే వార్తలు కూడా వినిపించాయి.
Anchor Pradeep: పొలిటికల్ లీడర్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రదీప్.. ఏమన్నారంటే..?
వరుస చిత్రాలతో బిజీగా మారిన పూజా హెగ్డే..
ఇప్పుడు కాస్త అమ్మడి అదృష్టం పండినట్టు అనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya ) నటిస్తున్న ‘రెట్రో’ సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈమె రజినీకాంత్(Rajinkanth) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమైంది. అంతే కాదు రాఘవ లారెన్స్(Raghava Lawrence) ‘కాంచన 4’ మూవీలో కూడా పూజా హెగ్డే అవకాశం అందుకుందని, అలాగే ఒక హిందీ సినిమాలో కూడా ఛాన్స్ లభించిందని సమాచారం. ఈ చిత్రాలన్నీ కూడా ఎంతవరకు హిట్ అవుతాయి? ఎంతవరకు ఈమెకు గుర్తింపును అందిస్తాయి అనే విషయం వైరల్ గా మారింది.. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకుని అమ్మవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది.
శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు..
ముఖ్యంగా శ్రీకాళహస్తిలో ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించింది. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు శేష వస్త్రంతో ఆమెను సత్కరించి, వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు కూడా అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సక్సెస్ కోసం గత కొన్ని రోజులుగా పూజా హెగ్డే ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇలా సక్సెస్ కోసమే ఆమె పూజలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదేనా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియదు కానీ ప్రస్తుతం పూజా హెగ్డే మాత్రం శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించేసరికి పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో ఫాలోవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అందులో భాగంగానే గ్లామర్ తో యువతలో వేడి పుట్టించేలా ఫోటోలు షేర్ చేస్తూనే మరొకవైపు తన అందంతో దర్శకుల కంట్లో కూడా పడుతుతోంది ఈ ముద్దుగుమ్మ. అలా మొత్తానికైతే ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటోంది. మరి ఈ చిత్రాలన్నీ ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.
కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న పూజా హెగ్డే #PoojaHegde #SriKalahastiTemple #family #BIGTVCinema @hegdepooja pic.twitter.com/kQxhsgbujl
— BIG TV Cinema (@BigtvCinema) April 3, 2025