BigTV English

Betting Apps: 10 కోట్ల స్కాం.. మొత్తం నాగార్జున వల్లే.. తేజ, సిరిల భాగోతం బయటపెట్టిన అన్వేష్

Betting Apps: 10 కోట్ల స్కాం.. మొత్తం నాగార్జున వల్లే.. తేజ, సిరిల భాగోతం బయటపెట్టిన అన్వేష్

Betting Apps: ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ గురించే అంతటా వైరల్ అయ్యింది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఎంత సంపాదిస్తున్నారో అంతా బయటపడింది. ముఖ్యంగా ఏయే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏయే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత సంపాదిస్తున్నారో చెప్పడానికి ఒక యూట్యూబర్ బయటికి వచ్చాడు. తనే నా అన్వేషణ. ఇప్పటికే ఎంతోమంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గుట్టు బయటపెట్టిన అన్వేష్.. తాజాగా టేస్టీ తేజ, సిరి హన్మంత్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, వాటి వల్ల వారు అందుకున్న లాభాల గురించి కూడా ఒక వీడియో విడుదల చేశాడు నా అన్వేషణ.


గెస్ట్‌గా హర్ష సాయి

‘‘అందంగా ఉండేది కాబట్టి టిక్ టాక్ వీడియోల వల్ల ఫేమస్ అయ్యింది సిరి హన్మంత్ (Siri Hanumanth). ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్‌తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. మెల్లగా ఫేమస్ అయ్యి పెరిగి పెద్దదయ్యింది. పెరిగి పెద్దది అవ్వడంతో నాగార్జున చూశారు. ఆయన మన్మథుడు కాబట్టి చూశాడు. బిగ్ బాస్‌లో అవకాశమిస్తే షన్నూతో ప్రేమాయణం నడిపింది. అందులో నుండి బయటికి వచ్చిన తర్వాత నిమిషానికి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి మూడు బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్స్‌ను ప్రారంభించింది. అక్కడ ఒక్క సిట్టింగ్‌కే రూ.80 వేలు. హర్ష సాయితోనే దానిని ఓపెన్ చేయించారు. ప్రస్తుతం హర్ష సాయికు రావాల్సిన రూ.15 కోట్ల బెట్టింగ్ ప్రమోషన్ డబ్బులు ఆగిపోయాయి. ఒక రేప్ కేసుతో పాటు మొత్తం తనపై 26 కేసులు ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చాడు అన్వేష్.


ఇద్దరికీ 10 కోట్లు

‘‘సిరి హన్మంత్ బ్యూటీ ట్రీట్మెంట్ క్లీనిక్ ఓపెనింగ్‌కు వచ్చిన 30 మంది కూడా బెట్టింగ్ మాఫియాకు చెందినవాళ్లే. మూడు క్లీనిక్స్‌కు రూ.6 కోట్లు పెట్టుబడి పెట్టింది. బెట్టింగ్ యాప్స్ వల్ల రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది లీగల్ కాదు’’ అని సిరి హన్మంత్ గుట్టు బయటపెట్టాడు అన్వేష్. ‘‘టేస్టీ తేజ తిండికి తికానా లేనోడు. పనికిరాని ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. అదే సమయంలో సినిమా వాళ్లతో ఎక్కువగా కనెక్షన్స్ ఉండడం వల్ల వాడికి బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ 7 నుండి బయటికొచ్చిన తర్వాత నా అంత తోపే లేడు అనుకున్నాడు. అలా దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడితో 28 కాఫీ షాప్స్ పెట్టాడు’’ అని చెప్పుకొచ్చాడు టేస్టీ తేజ.

Also Read: పొలిటికల్ లీడర్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రదీప్.. ఏమన్నారంటే.?

డిలీట్ చేశారు

‘‘నిజాయితీగా డబ్బులు సంపాదిస్తే తప్పు లేదు. యూట్యూబ్‌లో టేస్టీ తేజ (Tasty Teja)కు వచ్చిందే రూ.10 వేలు, సిరి హన్మంత్ ఏమో పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. వారికి ఇంత డబ్బులు ఎక్కడివి అని ఒక్కసారి ఆలోచించాలి కదా. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి వాటికి సంబంధించిన వీడియోలు అన్నీ డిలీట్ చేసేశారు. పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ ఆ వీడియోలు చూపించడానికి యూట్యూబ్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు’’ అని తెలిపాడు అన్వేష్. అలా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మరో వీడియో విడుదల చేసి హల్‌చల్ చేస్తున్నాడు ఈ యూట్యూబర్. అంతే కాకుండా హర్ష సాయిని పట్టిస్తే రూ.5 నుండి 10 లక్షల బహుమతి కూడా ప్రకటించాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×