BigTV English

Suriya – Jyothika: సూర్య ఇంట్లో స్టార్ సెలబ్రిటీస్ సందడి.. ఏమై ఉంటుంది..?

Suriya – Jyothika: సూర్య ఇంట్లో స్టార్ సెలబ్రిటీస్ సందడి.. ఏమై ఉంటుంది..?

Suriya – Jyothika..సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు అప్పుడప్పుడు అంతా ఒక చోట చేరి సందడి చేస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల అందరూ ఎక్కువగా గెట్ టు గెదర్ పార్టీలు ఏర్పాటు చేసుకొని మరీ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగానే తాజాగా హీరోయిన్ లు అందరూ కూడా హీరో సూర్య (Suriya ) హీరోయిన్ జ్యోతిక(Jyothika ) ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ నిర్వహించి సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ పార్టీలో ఎవరెవరు సందడి చేశారో ఇప్పుడు చూద్దాం.


సెలబ్రిటీలకు విందు ఏర్పాటుచేసిన సూర్య – జ్యోతిక..

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్య.. ఆయన భార్య జ్యోతిక , 2006లో ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగి 20 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఇద్దరూ అన్యోన్యంగా ప్రేమతో జీవిస్తున్నారు. ఈ జంట ఎంతో మందికి రోల్ మోడల్ అని కూడా చెప్పవచ్చు. ఇకపోతే ఇండస్ట్రీతో ఎంత మంచి అనుబంధమో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీలతో కలిసి సందడి చేసే వీరు అప్పుడప్పుడు తమ ఇంటికి ఆహ్వానించి విందు కూడా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరొకసారి సినీ సెలబ్రిటీలకు విందు ఏర్పాటు చేసింది ఈ జంట.


సూర్య ఇంట సందడి చేసిన సెలబ్రిటీలు..

ఇక అందులో భాగంగానే జ్యోతిక – సూర్య ఇంట పార్టీలో త్రిష (Trisha ), రమ్యకృష్ణ (Ramya Krishna), రాధికా శరత్ కుమార్(Radhika Sarath Kumar) విజయ్ టీవీ యాంకర్లు డిడి నీలకంఠం, విజయ రమ్య, డాన్స్ డైరెక్టర్ బృంద పాల్గొన్నారు. వీరితో సూర్య సెల్ఫీ తీసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా సూర్య ఇంటి ఆతిథ్యానికి ఉప్పొంగిపోయిన సెలబ్రిటీలందరూ కూడా ఆతిథ్యం చాలా బాగుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఈరోజు మరుపురాని రోజు అంటూ సూర్య- జ్యోతిక దంపతులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

సూర్య కెరియర్..

ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సూర్య ఆర్జె బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్యకి జోడిగా త్రిష నటిస్తున్నారు. వీరిద్దరూ చివరిసారిగా ‘ఆరు’ సినిమాలో కలిసి నటించగా.. ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత సూర్యా 45వ సినిమాలో కూడా ఆయనకు జోడిగా త్రిష నటిస్తుండడం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఇంత యంగ్గా కనిపించడంతో త్రిషపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు జ్యోతిక కూడా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు భర్తతో కలిసి నిర్మాణ సంస్థను కూడా స్థాపించిన ఈమె పలు చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా సూర్య – జ్యోతిక లకు సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సెలబ్రిటీలంతా ఒకే చోట కనిపించేసరికి అభిమానులు కూడా సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×