BigTV English

Krrish 4 : హృతిక్ రోషన్ హీరోయిన్ ప్రియాంక కాదు… మూవీ ప్లాట్ లీక్

Krrish 4 : హృతిక్ రోషన్ హీరోయిన్ ప్రియాంక కాదు… మూవీ ప్లాట్ లీక్

Krrish 4 : మోస్ట్ అవైటింగ్ సూపర్ హీరో మూవీ ‘క్రిష్ 4’ ఎట్టకేలకు త్వరలోనే పట్టాలెక్కబోపోతోంది అని ఇటీవలే దర్శకనిర్మాత రాకేష్ రోషన్ (Rakesh Roshan) అనౌన్స్ చేశారు. అప్పట్నుంచి ఈ మూవీ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopa) హీరోయిన్ గా నటించబోతోంది అనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ‘క్రిష్’ ఫ్రాంచైజీలో నాలుగవ భాగంగా రాబోతున్న ‘క్రిష్ 4’ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కాదని సమాచారం. అంతేకాకుండా ఈ మూవీ ప్లాట్ ఏంటో కూడా రివీల్ అయ్యింది.


హృతిక్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కాదు

‘క్రిష్’ ఫ్రాంచైజీలో ఇప్పటిదాకా మూడు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ‘క్రిష్ 4’ పట్టాలెక్కబోతోంది. ఈ నేపథ్యంలోనే ‘క్రిష్’ మూవీలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక చోప్రా ‘క్రిష్ 4’లో కూడా హీరోయిన్ గా కనిపిస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ వాటన్నింటికీ తాజాగా ఐఎండిబి ఫుల్ స్టాప్ పెట్టింది. తమ అఫీషియల్ వెబ్సైట్లో ఐఎండిబి ‘క్రిష్ 4’ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ నోరా ఫతేహి (Nora Fatehi) హీరోయిన్ గా నటించబోతుందని పేర్కొంది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రీతి జింటా కూడా నటిస్తోందని ఐఎండిబి పేర్కొనడంతో మూవీ ప్లాట్ ఏంటి ? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.


టైం ట్రావెల్ స్టోరీతో ‘క్రిష్ 4’

ఐఎండిబిలో ‘క్రిష్ 4’ టైం ట్రావెల్ మూవీ అనే విధంగా రాశారు. అందులో “కాల్ ను ఓడించిన తర్వాత ఒక ఏన్షియంట్ ఆర్టిఫ్యాక్ట్ క్రిష్ కి టైం ట్రావెల్ పవర్ ఇస్తుంది. ఆ తర్వాత క్రిష్ చరిత్రను తిరిగి రాయడానికి, భవిష్యత్తును పునర్నిర్మించడానికి ప్రయత్నం చేసే ఓ భయంకరమైన విలన్ ను ఎదుర్కోవడానికి వేర్వేరు యుగాల గుండా ప్రయాణిస్తాడు” అని  ఉంది.

దీంతో ఈ వార్తలు గనుక నిజమైతే ‘క్రిష్ 4’ ఈసారి కచ్చితంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అబ్బురపరచబోతోంది అని అంటున్నారు. కానీ అటు హీరోయిన్ విషయం, ఇటు మూవీ ప్లాట్ విషయంపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇదిలా ఉండగా ఇప్పటిదాకా సూపర్ హీరోగా కనిపించిన హృతిక్ రోషన్ ఇప్పుడు ఫస్ట్ టైం ‘క్రిష్ 4’ మూవీ కోసం దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

‘క్రిష్ 4’తో దర్శకుడిగా మారనున్న హృతిక్ 

ఇప్పటిదాకా ‘క్రిష్’ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలకు రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన తన కొడుకు, హీరో హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని ప్రకటించారు. ఈ మూవీని ఆయన ఆదిత్య చోప్రాతో కలిసి నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా రాకేష్ రోషన్ ‘క్రిష్ 4’ మూవీ అంతర్జాతీయ సాంకేతిక అంశాలతో, బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరపైకి రాబోతోందని వెల్లడించారు. దీంతో ‘క్రిష్ 4’పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఇందులో హీరోయిన్ ఎవరు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×