E-Paper
Advertisement

Nayanthara : వివాదాల్లో లేడీస్ సూపర్ స్టార్ మూవీ..

Nayanthara : వివాదాల్లో లేడీస్ సూపర్ స్టార్ మూవీ..
Advertisement

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార.. సౌత్ ఇండస్ట్రీ నుంచి నార్త్ వరకు ప్రస్తుతం ఫ్యాన్ వేస్ట్ ఏర్పరచుకున్న నటి. రీసెంట్ గా షారుక్ తో ఆమె నటించిన జవాన్ చిత్రం నార్త్ లో కూడా ఆమెకు సాలిడ్ అభిమానుల్ని ఏర్పాటు చేసింది. మొదటినుంచి పారితోషకం విషయంలో నయనతార సౌత్ లో అందరికంటే ఎక్కువే వసూలు చేస్తూ వచ్చేది. అయినా సరే అందం.. అంతకుమించిన అభినయం.. ఉండడంతో ఆమెకు మంచిగా ఆఫర్స్ వచ్చేవి.

ఇప్పుడు నార్త్ లో కూడా క్రేజ్ రావడంతో.. ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇవ్వడానికి రెడీ అవుతూ నిర్మాతలు ఆమె కోసం క్యూలు కడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ నయనతార విషయంలో నిర్మాతలు అందరికీ ఒకే ఒక చిన్ని అసంతృప్తి మిగిలింది. నయనతార దేనికైనా ఓకే కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఎవరి మాట వినడం లేదు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.. ఎంత పారితోషకం ఇచ్చినా.. సినిమా ప్రమోషన్లకు నయనతార హాజరు. హీరోయిని రానప్పుడు సినిమాకి పబ్లిసిటీ సరిగ్గా జరగదని కొందరి అభిప్రాయం.

Advertisement

స్టార్ హీరోలు సైతం తాము నటించిన సినిమాలకు ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే నయనతార మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన సరే ప్రమోషన్స్ కి బయటకు వచ్చిన సందర్భం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నటించిన అన్నపూర్ణి మూవీ ప్రమోషన్స్ కోసం నయనతార హాజరు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రమోషన్స్లో పాల్గొనడమే కాదండోయ్ స్వయంగా ఒక లేడీస్ హాస్టల్ లో అన్నపూర్ణ అవతారం ఎత్తింది.

హాస్టల్లోని అమ్మాయిలకు స్వయంగా తన చేతులతో భోజనం వడ్డించి.. అన్నపూర్ణ సినిమా టైటిల్ను వినూత్నంగా ప్రమోట్ కూడా చేసింది. ప్రస్తుతం ఇలా ఈ సినిమా ప్రమోషన్ కోసం నయనతార బయటకు వచ్చిన నేపథ్యం ..ఫాన్స్ కి ఆనందం కలిగిస్తుంటే ..నిర్మాతలకు షాక్ కలిగిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమా గురించి ప్రస్తుతం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఈ మూవీలో హీరోయిన్ ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. దేశంలో నెంబర్ వన్ చెఫ్ అవ్వాలి అనే ఆమె సంకల్పం కోసం ఆచారాలను.. కట్టుబాట్లను పక్కనపెట్టి మాంసాహారం వంటల్ని చేయడానికి కూడా సిద్ధపడుతుంది. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి నచ్చడం లేదు. అలా ఎలా చూపిస్తారు తమిళనాడు బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనితో పాటుగా మూవీ ని బ్యాన్ చేయాలని నినాదాలు కూడా చేస్తున్నారు. మరి ఇప్పటికే విడుదల అయిపోయిన మూవీపై ఈ విషయం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×