BigTV English

Revanth Reddy : ప్రత్యర్థులకు సింహస్వప్నం.. తెలంగాణ ఫైర్ బ్రాండ్.. తగ్గదేలే..!

Revanth Reddy : ప్రత్యర్థులకు సింహస్వప్నం.. తెలంగాణ ఫైర్ బ్రాండ్.. తగ్గదేలే..!
Revanth Reddy today news

Revanth Reddy today news(Latest political news telangana) :

ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కారు చీకట్లలో మగ్గుతున్న జనం జీవితాల్లో మెరిసే కాంతిపుంజమయ్యాడు. తెలంగాణ గడ్డ మీద చెరగని ముద్ర వేశాడు. మహోజ్వల చరిత్ర సృష్టించాడు. ఒక్కడిగా మొదలై.. మహా శక్తిగా ఎదిగాడు. జనంతో జయహో అనిపించుకున్నాడు. సాధిస్తాం.. నిలబడుతాం.. కలబడుతాం.. అంటూ కదనరంగంలో దిగి జగజ్జేతగా నిలిచాడు. ఆయనే తెలంగాణలో గడప గడపకు పరిచయం అక్కర్లేని ఎనుముల రేవంత్ రెడ్డి. విజయానికి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.


చుట్టూ కారు చీకట్లు..
చేతిలో దీపం లేదు..
వెళ్లాల్సిందేమో దూరం..
దారంతా గోతులు..
అయినా.. ఆయన ధైర్యమే ఓ మహాద్భుత కవచంగా పని చేసింది.. ఆయన లక్ష్యమే ఓ కాంతిపుంజమైంది. మిరుమిట్లు గొలిపే ఆ ప్రచండమైన కాంతి.. కారు మబ్బులను ఒక్కసారిగా పంటాపంచలు చేసింది. ప్రజా తెలంగాణ బంగారు బాటలు వేసేందుకు సిద్ధమంటూ అడుగులో అడుగు వేసింది. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రతి గడప గడపలో రేవంతుడి పేరు మార్మోగుతోంది.

ప్రత్యర్థులకు సింహస్వప్నమయ్యాడు..
అభాగ్యులకు ఆపద్బాంధవుడయ్యాడు..
పేదల పాలిట పెన్నిధి అయ్యాడు..
యువ ఆశలకు భవిష్యత్ అయ్యాడు..
అందుకే రేవంతుడు అందరి వాడు అయ్యాడు..
ఇందుకు నిదర్శనమే ఈ జన ఘన విజయం..


మాకు తిరుగే లేదు, ఎదురే లేదు అనుకున్న వారిని మొదటిసారి గజగజ వణికేలా చేశాడు. అధికారంతో అహంకారం మత్తు తలకెక్కిన వారికి ప్రజాతీర్పు ఎలా ఉంటుందో.. దగ్గరుండి రుచి చూపించాడు. అందరి వాడిగా జనం మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు రేవంత్. జన నేత అయ్యాడు. జనం మెచ్చిన నాయకుడయ్యాడు.

క్లాస్ కు క్లాస్.. మాస్ కు మాస్.. అంతకు మించి తెలంగాణ ఫైర్ బ్రాండ్…. ఎక్కడా తగ్గేదే లేదంటూ తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ సాగించిన పవర్ ఫుల్ జర్నీ మాటలకందనిది. రోజుకు 4 గంటలే నిద్ర. కంటి నిండ నిద్ర లేదు.. కడుపు నిండ తిండి లేదు. ప్రపంచంలో ఎన్నిరకాల వ్యూహాలు ఉంటాయో అంతకు మించి అమలు చేశారు. ప్రత్యర్థిని కసితీరా ఓడించారు. రేవంత్ ను ఢీకొట్టడం అసాధ్యమని ప్రత్యర్థులకు నిరూపించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టిన రేవంత్ కు తెలంగాణ రాజదండం రారమ్మని ఆహ్వానం పలుకుతోంది.

వాక్చాతుర్యం దండిగా.. ఆత్మవిశ్వాసం మెండుగా ఎన్నికల రణక్షేత్రంలో దూకిన రేవంత్ రెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. జనం మెచ్చిన వాడే జనార్ధనుడన్నది లోకోక్తి. ఇప్పుడు ఈ మాటకు అసలైన అర్థంగా మారారు రేవంత్. జనమంతా మెచ్చిన రేవంతుడికి అంతా జేజేలు పలుకుతున్న సందర్భమిది. ఈ ఘన విజయం అదృష్టంతో అందుకున్నది కాదు. గాలికి చిక్కింది అసలే కాదు. రేవంత్ ప్లానింగ్, పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్ తోనే ఇది సాధ్యమైంది. నాయకత్వమంటే దారిపొడవునా ముందు నడవడం కాదు.. బాట వేయడం.. తోవ చూపడం అంటూ రేవంత్ నిరూపించారు. అందుకే ఈ విజయం సకల జనుల మనసులను గెలిచింది. అందుకే ఈ విజయం ప్రజా విజయమైంది. ఇందిరమ్మ రాజ్యానికి మరోసారి బాటలు వేసింది.

సాహసించే వ్యక్తి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుందంటారు. అయితే మొదట సాహసించేదెవరు? అన్న ప్రశ్నల నుంచి సమరమే అంటూ తానే ముందడుగు వేశారు రేవంత్ రెడ్డి. అందుకే ఇది చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే జన ఘన విజయం. పొగడ్తకు అర్హులైన వారిని పొగిడి తీరాల్సిందే. ఇప్పుడు ఆ పొగడ్తకు రేవంత్ రెడ్డి నూరుకు నూరు శాతం అర్హులు. వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా ఆలోచనా విధానమే మూలం. అదే రేవంత్ ను విజయ బాటలో నడిపించడానికి కారణమైంది. తానే కాదు.. తోటివారిలోనూ సాధించాలన్న పట్టుదలనూ సాధించగలమన్న నమ్మకాన్నీ నింపుతూ నాయకత్వ బాధ్యతలను భుజాన వేసుకున్నారు రేవంత్. టీంవర్క్ తో, మొక్కవోని దీక్షతో తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ నడిపిన విధానం, కేసీఆర్ అహంకార వైఖరిపై చేసిన పోరాటం.. ప్రజలను మనస్ఫూర్తిగా ఆకట్టుకుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదన్న ఆలోచన జనంలో కలిగించి.. సఫలమయ్యారు రేవంత్. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్న నినాదానికి సార్థకత చేకూరడంలో తనదైన పాత్ర పోషించారు.

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న రేవంత్.. తాను అనుకున్న లక్ష్యంలో ఇప్పుడు చాలా పెద్ద మెట్టు ఎక్కారు. అదీ సంకల్పమంటే. అదీ లక్ష్యాన్ని చేరుకోవడం అంటే. రేవంత్ పదహారేళ్ల రాజకీయ అనుభవం ఒక పొలిటికల్ పాఠమే. రేపటి పని ఇవాళే చెయ్, ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చెయ్ ఈ సూత్రమే ఆయన్ను ముందుకు నడిపింది. అసలేమాత్రం దూకుడు లేకపోతే ఇప్పటి రాజకీయాల్లో రాణించడం కష్టం. ఇది రేవంత్ కు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ప్రత్యర్థి పెద్ద నేత. పదేళ్లు అధికారంలో ఉన్న నేత. వ్యవస్థలను శాసించే స్థితిలో ఉన్న నేత. వాక్చాతుర్యంలో, సామాజిక సమీకరణాలను రాజకీయాలకు అనువుగా ఉపయోగించుకోవడంలోనూ కాకలు తీరిపోయిన కేసీఆర్ ముందు రేవంత్ దూకుడు చాలా పని చేసింది. అలాగే కాంగ్రెస్ లో తానే కీలకం అని చెప్పుకోవడానికి జరిగిన రేసులో… రేవంత్ ఎప్పుడూ వెనక్కు తగ్గకుండా చేసిందీ అదే.

ఇక మన పనైపోయింది… కేసీఆర్ ఎత్తుల ముందు.. వ్యూహాల ముందు నిలబడడం, కలబడడం, గెలవడం సాధ్యమేనా అనుకున్న స్థితి నుంచి.. సాధ్యమే అని నిరూపించేదాకా రేవంత్ ఎక్కడా పట్టు విడవలేదు. సవాళ్లతో సవారీ చేశారు. ఖతర్నాక్ కమిట్ మెంట్ తో అవరోధాలను అధిగమించారు. టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ చాలా కరెక్ట్ ప్లానింగ్ రచించారు. విజయానికి ఎన్ని మెట్లు ఉన్నాయో లెక్కలేసుకున్నారు. అవన్నీ ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇప్పుడు రాజదండం చేపట్టే స్థాయికి వచ్చేశారు.

ఎవరికి వారే ఉండే కాంగ్రెస్ లో అందరినీ ఒక్కతాటిపైకి తేవడం ఒక బిగ్ సక్సెస్. అది రేవంత్ చేసి చూపించారు. పీసీసీ అధ్యక్షుడిగా కలిసి వచ్చే వాళ్లను ప్రోత్సహించారు. అన్నీ మంచి శకునములే అన్నట్లుగా టిక్కెట్ల కేటాయింపు నుంచి ప్రచారాల దాకా విజయవంతమయ్యాయి. జనంలోకి ఎంతలా వెళ్లాలో అంతా చేశారు. అందుకే ఈ ఘన విజయం హస్తగతమైంది. ఇక హస్తం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్.. తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా.. రాష్ట్రమంతా ఒంటి చేత్తో ప్రచారం హోరెత్తించారు. జనంలో, శ్రేణుల్లో ఒకరకమైన జోష్ తెప్పించారు. మార్పు కావాలి అన్నా.. బైబై కేసీఆర్ అన్నా.. ఇవన్నీ ప్రచారాన్ని ఒక సునామీలా మార్చేశాయి. టీవీలు, పేపర్లలో అందరినీ ఆలోచింపజేసేలా రూపొందించిన కాంగ్రెస్ ప్రకటనల వెనుక రేవంత్ కష్టం ఎంతో ఉంది.

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, వెనుకబడ్డ నల్లమల గడ్డ నుంచి వచ్చి.. యావత్ తెలంగాణ గర్వించదగ్గ నాయకుడిగా అవతరించి.. రేవంత్ రెడ్డి సాగించిన ప్రస్థానం, ప్రయాణం అత్యద్భుతం. ఇన్నాళ్లు ప్రత్యర్థిపై చేసిన పోరాటం ముగిసింది. ఇప్పుడు తెలంగాణ కారు మబ్బులను తరిమే లక్ష్యమే ముందుంది. అందుకోసం తెలంగాణ పగ్గాలు చేపట్టేందుకు రాజదండం సగర్వంగా ఆహ్వానిస్తోంది. ఒక చరిత్ర సృష్టించిన రేవంత్ రాజకీయ జీవితం.. మరో మజిలీకి, కొత్త సవాళ్లకు సిద్ధమైంది.

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×