Revanth Reddy news(Andhra news today):
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ఎలక్షన్ హీట్.. ఏపీని కూడా తాకింది. ఏపీలోని పలువురు ప్రముఖులు సైతం కాంగ్రెస్ పార్టీకి అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ విషెష్ చెబుతున్నారు.
ఇదే క్రమంలో విజయవాడలోనూ రేవంత్ రెడ్డికి సంబంధించిన భారీ హోర్డింగ్స్ వెలిశాయి. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డికి హార్దిక శుభాకాంక్షలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడీ వ్యవహారమే ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలోని బెంజి సర్కిల్, తాడేపల్లి, ఎయిర్ పోర్ట్ వద్ద భారీ హోర్డింగులు దర్శనం ఇస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే.. ఈసారి ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.