E-Paper
Advertisement

Nazriya Nazim : క్యూట్ లుక్స్ తో.. మెస్మరైజ్ చేసే తేనె కళ్ల సుందరి “నజ్రియా”

Nazriya Nazim : క్యూట్ లుక్స్ తో.. మెస్మరైజ్ చేసే తేనె కళ్ల సుందరి “నజ్రియా”
Advertisement
Nazriya Nazim

Nazriya Nazim : ‘రాజా రాణి’ సినిమా తో తెలుగు పేక్షకులకు పరిచయమైన అందాల బ్యూటీ “నజ్రియా”.. తన నటనకు ఫిదా అయిన కుర్రకారు ఆమెను తమ క్రష్​ లిస్ట్​లో యాడ్ చేసుకున్నారు. తన క్యూట్​ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్​ చేసే ఈ బ్యూటీ డిసెంబర్ 20 న ఈమె పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ చిన్నదాని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.

అల్లరి పిల్లలా కనిపించి తన నటనతో ఆకట్టుకోవాలన్నా , ఎమోషనల్ సీన్ లో లీనమైపోయేలా చేసి పేక్షకులను ఏడిపించాలన్నా.. అది మల్లు బ్యూటీ నజ్రియాకే సాధ్యం. తన నటనతో అంతలా ఆకట్టుకుంటుంది ఈ తేనె కళ్ళ సుందరి. “పలుంకు” సినిమాతో బాల నటిగా తెరంగేట్రం చేసిన ఈ అందాల భామ తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది .

Advertisement

తెలుగు , మలయాళం , తమిళ సినిమాల్లో తనదైన శైలిలో నటించి ఆకట్టుకుంది. అంతే కాకుండా అగ్రహీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో క్రేజ్ సంపాదించుకుంది. తెలుగునాట డబ్బింగ్ సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. రాజా రాణి సినిమాలో ఈమె నటనకు ఎంతో మంది ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నజ్రియా.. యూత్ ఫేవరెట్ క్రష్ గానే ఉంది.

2006 లో “పలుంకు ” అనే మూవీ తో బాల నటిగా తెరంగేట్రం చేసింది . ఆ తర్వాత పలు షో ల్లో యాంకర్ గా కనిపించింది . 2013 లో “మ్యాడ్ డ్యాడ్ ” అనే సినిమాతో స్క్రీన్ మీద కనిపించింది. తర్వాత నేరమ్ అనే మూవీలో నటించి మంచి గుర్తింపు పొందింది. ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. నయ్యండి , సలాలా మొబైల్స్ , ఓమ్ శాంతి ఓషాన , బెంగుళూర్ డేస్ ,తిరుమానం అనుమ్ నిక్కా ,కూడే ,ట్రాన్స్ ,అంటే సుందరానికి , సినిమాల్లో నటించింది

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×