BigTV English

NBK Help:మంచి మ‌న‌సు చాటుకున్న బాల‌య్య‌

NBK Help:మంచి మ‌న‌సు చాటుకున్న బాల‌య్య‌

NBK Help:నంద‌మూరి బాల‌కృష్ణ‌తో మాట్లాడాలంటే భ‌యం.. చూస్తే భ‌యం అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆయ‌న మ‌న‌సు చాలా మంచిద‌ని ద‌గ్గ‌ర నుంచి చూసినవారు అంటుంటారు. ఇప్పుడు ఆయ‌న ఎవ‌రికీ తెలియ‌కుండా చేసిన సాయం గురించిన వార్తొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాయం అంటే అంతా ఇంతా కాదు.. ఏకంగా రూ.40 ల‌క్ష‌లు. ఇంత మొత్తంలో సాయం చేయ‌ట‌మంటే మాట‌లు కాదు. కానీ.. బాల‌కృష్ణ అంత మొత్తాన్ని సాయంగా అందించారనే వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే..


హైద‌రాబాద్‌లో పేరు మోసిన బ‌స‌వ తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌కు నంద‌మూరి బాల‌కృష్ణ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డ‌బ్బున్న వారికే కాకుండా ఆరోగ్య‌శ్రీ కార్డున్న పేద‌ల‌కు వైద్య‌సాయం అక్క‌డ అందుతుంటుంది. కొన్ని సందర్భాల్లో పేద‌ల‌కు బాల‌కృష్ణ తమ ట్ర‌స్ట్ నుంచి ఎలాంటి డ‌బ్బులు తీసుకోకుండా ట్రీట్‌మెంట్ అందిస్తుంటారు. ఇటీవ‌ల డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌గ్గ‌ర మ‌హేష్ యాద‌వ్ అనే యువ‌కుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వర్క్ చేశారు. త‌న‌కు బ్రెయిన్ ట్యూమ‌ర్ వ్యాధి వ‌చ్చింది.

ప్రైవేట్ హాస్పిట‌ల్‌కి వెళితే ఆ ట్యూమ‌ర్‌ని తొల‌గించ‌టానికి రూ.40 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని చెప్పార‌ట‌. మ‌హేష్ యాద‌వ్‌కి ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి. ఆ స‌మ‌యంలో విష‌యం తెలుసుకున్న బోయ‌పాటి శ్రీను బాల‌కృష్ణ‌కి రెక‌మండ్ చేయ‌టంతో మ‌హేష్ యాద‌వ్ బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యాడు. త‌నకి డాక్ట‌ర్స్ ఆప‌రేష‌న్ చేసిన ట్యూమ‌ర్‌ని తొల‌గించారు. అలా చేయ‌టానికి డ‌బ్బులు ఏమీ తీసుకోలేద‌ట‌. అలా అవ‌స‌రంలోని వ్య‌క్తికి బాల‌కృష్ణ ఏకంగా రూ.40 ల‌క్ష‌లు సాయాన్ని అందించారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×