BigTV English

IND Vs AUS : రెండో టెస్టు.. వంద క్లబ్ లో పూజారా.. అశ్విన్, జడేజా రికార్డుల వేట..

IND Vs AUS : రెండో టెస్టు.. వంద క్లబ్ లో పూజారా.. అశ్విన్, జడేజా రికార్డుల వేట..

IND Vs AUS : భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ లోనే ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి.
ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టులో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయం. పూజరా వంద టెస్టుల క్లబ్ లో చేరబోతున్నాడు. అశ్విన్, జడేజా రికార్డుల వేటలో ఉన్నారు. తొలిటెస్టులో విజయం సాధించి ఊపుమీదున్న భారత్ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. ఆసీస్.. భారత్ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొనాలో తెలియక ఇబ్బందులు పడుతోంది. ఈ నెల 17 నుంచి రెండో టెస్టు జరుగుతుంది.


100 క్లబ్‌లో పుజారా..
నయా వాల్ ఆఫ్ ఇండియా ఛెతేశ్వర్ పూజరా ఢిల్లీ టెస్టుతో అరుదైన ఘనత సాధించబోతున్నాడు. పుజారా 100 టెస్టుల క్లబ్‌లో చేరబోతున్నాడు. భారత్ తరఫున ఇప్పటివరకు సచిన్, ద్రవిడ్, వీవీఎస్‌ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, సౌరభ్‌ గంగూలీ, ఇషాంత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, హర్భజన్‌ సింగ్, సెహ్వాగ్‌ ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు 99 టెస్టుల్లో పూజరా 7,021 పరుగులు చేశాడు. సగటు 44. 15. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 206 నాటౌట్. టెస్టుల్లో 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేశాడు.

అశ్విన్ రికార్డులు..
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 8 వికెట్లు తీసిన అశ్విన్ 450 వికెట్ల మైలురాయి అధిగమించాడు. ఈ ఘనత అందుకున్న 9వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు. అనిల్ కుంబ్లే (619) మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 450 వికెట్ల క్లబ్‌లో మురళీధరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708), జేమ్స్‌ అండర్సన్‌ (675), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (566), మెక్ గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519), నాథన్ లైయన్ (460) ఉన్నారు. హర్భజన్‌ సింగ్ (95)ని అధిగమించి టెస్టుల్లో ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు అశ్విన్ ( 97). ఢిల్లీలో జరిగే రెండో టెస్టులో ఆసీస్ పై వంద వికెట్ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. మొత్తంగా అనిల్ కుంబ్లే (111) మొదటి స్థానంలో ఉన్నాడు. మిగిలిన 3 టెస్టుల్లో ఇదే విధంగా రాణిస్తే అశ్విన్.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు కొట్టడం ఖాయం.


అడుగుదూరంలో జడ్డూ..
ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇప్పటివరకు 61 టెస్టులు ఆడి 249 వికెట్లు పడగొట్టాడు. ఇక ఒక వికెట్ తీస్తే 250 వికెట్లు పడగొట్టిన బౌలర్ల క్లబ్‌లో చేరుతాడు. జడ్డూ టెస్టుల్లో 2,593 పరుగులు చేయడం విశేషం. 50 వికెట్ల క్లబ్ లో చేరడానికి అక్షర్ పటేల్ 2 వికెట్లు దూరంలో, సిరాజ్ 3 వికెట్ల దూరంలో ఉన్నారు. అక్షర్ ఇప్పటి వరకు 9 టెస్టులు మాత్రమే ఆడగా.. సిరాజ్ 16 టెస్టులు ఆడాడు. ఇలా ఎన్నో రికార్డులు అభిమానులను ఊరిస్తున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×