BigTV English

35 Chinna Katha Kaadu: నీలి మేఘములలో.. అచ్చ తెలుగు పాట.. ఎంత వినసొంపుగా ఉంది

35 Chinna Katha Kaadu: నీలి మేఘములలో.. అచ్చ తెలుగు పాట.. ఎంత వినసొంపుగా ఉంది

35 Chinna Katha Kaadu: హీరోయిన్ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు. నంద కిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ సినిమాను  సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించగా.. రానా దగ్గుబాటి సమర్పిస్తున్నాడు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ రోజు రెండు, మూడు పెద్ద సినిమాలు ఉండడంతో  ఈ సినిమా వెనక్కి తగ్గింది. 35 చిన్న కథ కాదు సెప్టెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నివేదా.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను పెంచుతుంది. ఇంకోపక్క మేకర్స్.. సినిమా నుంచి లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారు.


తాజాగా నీలి మేఘములో అని సాగే సాంగ్ ను  రిలీజ్ చేశారు.  ఈ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది. తెలుగుదనం ఉట్టిపడేలా క్లాసికల్ సాంగ్ అని చెప్పొచ్చు. భరద్వాజ్ గాలి అందించిన లిరిక్స్ కు పృథ్వీ రాజ్ వాయిస్.. వివేక్ సాగా సంగీతం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక చిన్నారుల క్లాసికల్ డ్యాన్స్ అయితే అదిరిపోయింది. అచ్చ తెలుగు పదాలను వర్ణించడం చాలా కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నివేదా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×