BigTV English

Allu Arjun: తీరు మారలేదు, మళ్ళీ మళ్ళీ ఆర్మీ గోలే

Allu Arjun: తీరు మారలేదు, మళ్ళీ మళ్ళీ ఆర్మీ గోలే

Allu Arjun: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో అల్లు అర్జున్ కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి సినిమాకి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంటున్నాడు. అల్లు అర్జున్ కెరియర్ లో పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. సుకుమార్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం చాలామంది నార్త్ ఆడియన్స్ కి పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. తెలుగులో మొదట సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. కానీ నార్త్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో ఆ సినిమా కూడా సక్సెస్ అయిపోయింది. ఈ సినిమా లోని కొన్ని డైలాగ్స్, మేనరిజమ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా వర్కౌట్ అయ్యాయి. చాలామంది సెలబ్రిటీస్, స్పోర్ట్స్ మేన్స్, పొలిటికల్ లీడర్స్ ఈ సినిమాలోని డైలాగ్స్ ను విపరీతంగా వాడటం వలన మరింత పాపులర్ అయింది. ఈ సినిమాకి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.


అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో విపరీతంగా కష్టపడతాడు అనడంలో సందేహం లేదు. కానీ అల్లు అర్జున్ మాట్లాడిన కొన్ని మాటలు కొన్నిసార్లు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి. అలా సరైనోడు ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ అన్నప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి ఒక కోల్డ్ వారు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒక మనసు సినిమా ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ దీని గురించి ఏకధాటిగా స్పీచ్ ఇస్తూ చివర్లో జై పవర్ స్టార్ అని అరవటం చాలామందికి నచ్చలేదు. ఇకపోతే తను మాట్లాడిన ప్రతిసారి తను ఇంతవరకు రావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని చెప్తూ ఉండే అల్లు అర్జున్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ ప్రస్తావన తీయడం ఆపేశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో అనే సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ నాకంటూ ఒక ఆర్మీ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అప్పుడు నుంచి అల్లు ఆర్మీ ని మెగా ఫ్యాన్స్ తో పాటు చాలామంది ట్రోల్ చేస్తూ ఉండేవారు. ఆర్మీ అంతా స్కూల్ కి వెళ్ళింది అంటూ విపరీతంగా కామెంట్స్ కూడా చేసేవాళ్ళు. అయితే పుష్ప సినిమా వివాదంలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతలా నిలబడ్డారు చాలామందికి తెలిసిన విషయమే. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా వెళ్లి ఆ ఫ్యామిలీని కలిశారు. తన గ్రాటిట్యూడ్ ఏంటో చూపించారు. అయితే ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో ఆర్మీ ప్రస్తావన తీసుకొచ్చాడు. దీనిపైన ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నీ లైఫ్ లో వివాదాలు జరిగినప్పుడు ఏ ఆర్మీ నిలబడింది అంటూ క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. మళ్లీ అదే గోలను మొదలుపెట్టాడు అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : Actress : ఏజ్ లో తమకంటే చిన్న హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీళ్ళే

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×