Notices to YSRCP Office: ఏపీ ప్రభుత్వం ట్రెండ్ మార్చింది? మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి మాజీ సీఎం జగన్ కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారా? ఈ చిన్న అవకాశం ఆయనకు ఇవ్వకుండా జాగ్రత్త పడుతోందా? ఈ క్రమంలో వైసీపీ ఆఫీసుకు అమరావతి పోలీసులు నోటీసులు ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
శాంతి భద్రతలు ఎంత బాగుంటే అంత అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. చీటికీ మాటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ విపక్షాలు పదేపదే ప్రస్తావించడంపై అటు వైపు దృష్టి పెట్టారు ఏపీ పోలీసులు. లేటెస్ట్‌గా వైసీపీ ఆఫీసుకు అమరావతి పోలీసులు నోటీసులిచ్చారు.
ఈనెల ఆరున గురువారం ఒకే రోజు రెండుసార్లు తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ చుట్టూ అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఒకటి పగలు.. మరొకటి రాత్రివేళ ఈ ఘటనలు జరిగాయి. అదే రోజు రాత్రికి వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధితో తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో మంటలు రాజుకున్నాయి. దీనిపై ఏపీ అంతటా చర్చ మొదలైంది.
మరుసటి రోజు ఆసక్తికరమైన ట్వీట్ చేసింది టీడీపీ. అగ్నిజ్వాలల్లో తగలబడిన కాగితాలు, డైరీల మాటేంటంటూ ప్రశ్నించింది. లిక్కర్ స్కామ్‌లో దాచుకున్న లెక్కల పత్రాలన్నీ తగలబెట్టారా అంటూ ప్రశ్నలు రైజ్ చేసింది. ఈ ఘటన జరిగి ఇప్పటి మూడురోజులు అయ్యింది. ఆ పార్టీ ఎలాంటి ఫుటేజ్ బయటపెట్టలేదు. దీంతో మంటల వెనుక ఏదో జరుగుతోందన్న చర్చ జరుగుతోంది.
ALSO READ: వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. బెంగుళూరు కేంద్రంగా జగన్ చర్చలు
తాజాగా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు అమరావతి పోలీసులు. అగ్నిజ్వాలల ఘటనలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మంటలు ఎలా అంటుకున్నాయి? కావాలని ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? అయినవాళ్లే ఆ విధంగా స్కెచ్ వేశారా అనేదానిపై కూపీ లాగుతోంది. పోలీసులు ఎలాంటి సమాచారం లభించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. మరి దీనిపై వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
వైసీపీ కార్యాలయానికి పోలీసుల నోటీసులు
సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు
జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై పోలీసుల దర్యాప్తు
మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చేందుకు దర్యాప్తు చేపడుతున్న తాడేపల్లి పోలీసులు pic.twitter.com/PE1saxjxw4
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2025