Thug Life Trisha Role: సినిమాల్లో కొన్ని పాత్రలకు ఎప్పుడు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనం చేసే కొన్ని పాత్రలు మన కెరియర్ కి ప్లస్ అవ్వాలి అని ప్రతి నటుడు అనుకుంటారు. అయితే అన్నిసార్లు అది జరగదు. కొన్ని పాత్రలను చేయడానికి కూడా కొంతమంది వెనకాడుతూ ఉంటారు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమా గురించి కీర్తి సురేష్ కంటే ముందు ఒక నటి కి చెప్పారు. అయితే ఆ సినిమాలు మందు తాగే సీన్స్ ఉండటం వలన ఆ నటి రిజెక్ట్ చేశారు. కానీ సినిమాలో ప్యూర్ ఎమోషన్ ఉండడం వలన కీర్తి సురేష్ ఆ పాత్ర చేయడంతో ఆమె కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఎటువంటి నెగెటివిటీ కూడా కీర్తి సురేష్ పైన పడలేదు. తెలుగు సినిమాలలో వేశ్య పాత్రలు కూడా కొంతమంది దర్శకులు రాస్తారు. అయితే వాటిని చేయడానికి ఒక నటి ముందుకు వచ్చేటప్పుడు చాలా సందర్భాలలో ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటివరకు స్నేహ, అనుష్క ఐటెం రోల్స్ లో కనిపించారు. వాళ్ల మీద లేని నెగెటివిటీ ఇప్పుడు త్రిష మీద ఎందుకు వస్తుంది.?
పుదుపేట్టై – స్నేహ
పుదుపేట్టై సినిమాలోని స్నేహ పేరు కృష్ణవేణి. కృష్ణవేణి అనే వేశ్య అన్బు కింద పనిచేస్తోంది. కుమార్ ఆమెను ఇష్టపడి అన్బును విడుదల చేయమని అడుగుతాడు. కుమార్ ధైర్యం చూసి అన్బు షాక్ అయ్యి అతని అభ్యర్థనను తిరస్కరిస్తాడు. అతను కృష్ణవేణిని కొట్టి కుమార్‌ను చంపమని తన మనుషులను ఆదేశిస్తాడు. కుమార్ అన్బు దగ్గరికి వెళ్లి క్షమించమని వేడుకుంటాడు, కానీ అన్బు నిరాకరించడంతో కుమార్ అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత కృష్ణవేణి కుమార్ కలిసి జీవనం కొనసాగిస్తారు. అయితే ఆ పాత్రకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చాడు దర్శకుడు.
వేదం – అనుష్క
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో అనుష్క వేస్ట్ గా కనిపిస్తుంది అని మొదట అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపడ్డారు. కానీ ఆ కథకి ఉన్న ప్రత్యేకత ఆ కథలో కొన్ని పాత్రలకు ఉన్న వ్యక్తిగత కథలు ఇవన్నీ కూడా చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసి ఎమోషనల్ గా టచ్ చేయాలా చేశాయి. బహుశా క్రిష్ జాగర్లమూడి కథను చెప్పినప్పుడు ఇదే విషయాలను అనుష్కకి చెప్పడం వలన తను ఈ క్యారెక్టర్ కోసం ఒప్పుకొని ఉండొచ్చు. అయితే స్నేహం అనుష్క చేసిన పాత్రలకు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాలో త్రిషకు ఎందుకు నెగిటివిటీ వస్తుంది.
థగ్ లైఫ్ – త్రిష
త్రిష కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కుందవి అనే పాత్రలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందాం. 96 సినిమాలో జాను పాత్రను ఎవరు మర్చిపోలేరు. అయితే థగ్ లైఫ్ సినిమాలో త్రిష పాత్రను అనవసరంగా ఇరికించారు అనిపిస్తుంది. సినిమాకి ఏమాత్రం కూడా ఆ పాత్ర ప్లస్ కాలేదు. ఇప్పుడు నెగిటివిటీ రావడానికి కూడా కారణం సినిమా అసలు బాలేక పోవడం. ఒకవేళ సినిమా కొద్దిపాటి వర్కౌట్ అయి ఉంటే త్రిష పాత్రకు కూడా మంచి పేరు వచ్చేది. ఎందుకంటే అనుష్క, స్నేహ చేసిన ఆ రెండు సినిమాల్లో కథా బలం గట్టిగా ఉంది. థగ్ లైఫ్ సినిమాలో అది లేకపోవడం మైనస్ గా మారింది.
Also Read : Akhanda2 massive update : బాలయ్య అభిమానులకు పూనకలు, ఇక సోషల్ మీడియా భమ్ అఖండ అనాల్సిందే