Viral Video: పెద్ద పెద్ద అడవుల్లో ఉండాల్సిన పులులు, సింహాలు జనవాసాల్లోకి వచ్చి నానా హంగామా చేస్తున్నాయి. ఇలాంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో తరుచుగా చూస్తున్నాం. ముఖ్యంగా అడవి ప్రాంతానికి దగ్గరున్న గ్రామాల్లోకి జంతువులు ఎక్కువగా వస్తున్నాయి. పొలాల్లో పని చేస్తున్న రైతులపై పులులు దాడి చేసే ఘటనలో మనం ఆదిలాబాద్ జిల్లాలో చాలా సార్లు చూశాం. దీంతో అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న గ్రామాలు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ రోజు ఓ సింహం రోడ్డుపై సంచరిస్తున్న ఓ వీడియో మస్త్ వైరల్ అవుతోంది. అది గుజరాత్ రాష్ట్రంలో జరిగనట్టు తెలుస్తోంది.
"भारत में सड़क पर सो रहा एक व्यक्ति शेर का शिकार होने से बच गया, जब शेर उसके पास आया, उसे सूंघा और फिर वहां से चला गया।"
बेशक! जब तक ज़िंदगी लिखी है, कोई कुछ नहीं बिगाड़ सकता…!! pic.twitter.com/tm9aQzXkkZ
— ताज़ा तमाचा (@TazaTamacha) June 7, 2025
రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ వ్యక్తి వద్దకు సింహం వచ్చినట్టు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ మృగరాజు అతన్ని వాసన చూసి ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోయింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ అసాధారణ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో లక్షల మంది సోషల్ మీడియాలో ఆ వీడియోను వీక్షిస్తున్నారు. ఈ వీడియోలో సింహం నిశ్శబ్దంగా రోడ్డుపై నడుస్తూ, నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు వచ్చింది. అతన్ని జాగ్రత్తగా వాసన చూసి పసిగట్టింది. ఆ తర్వాత అతడి నిద్రను డిస్టర్బ్ చేయకుండా దాని దారిన అది వెళ్లిపోయింది. దీంతో వ్యక్తి ప్రాణాల నుంచి బయటపడ్డాడు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఆయుష్షు ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరి కొందరు ఇది ఫేక్ వీడియో అని, ఏఐతో క్రియేట్ చేసి ఉంటారని కామెంట్ చేశారు.
ALSO READ: మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. దండకారణ్యంలో మెయిన్ టార్గెట్ అతడేనా?
మరోవైపు కొందరు నెటిజన్లు ఆందోళనకు వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు సింహాలు అలాగే రోడ్లపై సంచరిస్తాయని మరొకరు కామెంట్ చేశాడు. వామ్మో.. గాఢ నిద్రలో ఉన్న ఆ వ్యక్తి భూమిపై నీకు నూకలున్నాయని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. లయన్ అతడి స్మెల్ చూసి.. టేస్ట్ బాగో లేదని వదిలేసి ఉండొచ్చని కొంత మంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు. కొందరైతే.. ఇది ఢిల్లీ-ముంబై మార్గంలో జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. కొన్ని సోషల్ మీడియా కొన్ని పోస్ట్‌లు ఈ వీడియోను ఏఐ ద్వారా క్రియేట్ చేశారని పేర్కొన్నప్పటకీ.. మనం 100 శాతం ఏఐ వీడియో అని చెప్పలేం.
ALSO READ: Kedarnath: హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారు ధ్వంసం, ఇదిగో వీడియో
అయితే, ఈ వీడియోలో సింహం ప్రవర్తన ఇంట్రెస్టింగ్ ఉంది. సాధారణంగా, సింహాలు, చిరుతపులు, ఖడ్గ మృగాలు వాటికి హానీ చేస్తేనే.. మనుషులపై దాడి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంలో.. సింహం ఆకలితో లేకపోవడం లేదా వ్యక్తి తన హానీ చేయడంలేదని.. భావించడం వల్ల దాడి చేయలేదని చెబుతున్నారు. ఈ ఘటన సింహాల సహజ ప్రవర్తనను, ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం గిర్ ప్రాంతంలో మనుషులతో సింహాలు ప్రవర్తించే విధానాన్ని హైలైట్ చేస్తుంది. అయితే ఈ వీడియోలో జరిగిన సంఘటన.. నిజంగా జరిగిందా..? లేకుంటే ఏఐ ఆధారంగా క్రియేట్ చేశారా అని మాత్రం క్లారిటీ లేదు.. కానీ వీడియోను మాత్రం లక్షల మంది వీక్షిస్తున్నారు.