Netflix :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది అక్కినేని కుటుంబం(Akkineni Family). ఇకపోతే త్వరలోనే అక్కినేని కుటుంబంలో సంబరాలు మిన్నంటనున్నాయి. అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya).. శోభిత ధూళిపాల(Shobhita dhulipala)తో ఏడడుగులు వేయడానికి సిద్ధం అయ్యారు. దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswar Rao)విగ్రహం ముందు అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య , శోభిత దూళిపాళ వివాహం జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు .ఈ మేరకు డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం అతి కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తోంది.
పెళ్లి డిజిటల్ ప్రసార హక్కులను రూ.50 కోట్లకు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్..
ఇదిలా ఉండగా.. తాజాగా నాగచైతన్య – శోభిత ధూళిపాల పెళ్లి కి సంబంధించి డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుందని, త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో.. పెళ్లి వీడియో ఆడియోన్స్ కి అందుబాటులోకి రాబోతోందనే వార్తలు చాప కింద నీరుల వ్యాపించాయి. అంతేకాదు నెట్ఫ్లిక్స్.. వీరి పెళ్లికి సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను రూ.50 కోట్లకు దక్కించుకుందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో నయనతార (Nayanthara)బాటలోనే అక్కినేని కొత్త కోడలు కూడా నడవబోతోంది అంటూ వార్తలు జోరుగా వైరల్ చేశారు. అయితే ఈ విషయాలు కాస్త వారి వద్దకు చేరడంతో తాజాగా దీనిపై స్పందించినట్లు సమాచారం.
ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేసిన సన్నిహితులు..
ఇకపోతే నాగచైతన్య- శోభిత పెళ్లికి సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను ఓటీటికి విక్రయించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఈ వార్తలలో నిజం లేదని స్పష్టం చేశాయి. ముఖ్యంగా తమ వివాహ వేడుకను ప్రైవేటుగా నిర్వహించాలని చైతూ – శోభిత నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశాయి. దయచేసి ఇలాంటి లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అంటూ మండిపడ్డారు.
నాగచైతన్య వ్యక్తిగత జీవితం..
నాగచైతన్య విషయానికి వస్తే.. ‘ఏ మాయ చేసావే’ సినిమాలో జంటగా నటించిన సమంత(Samantha)తో ప్రేమలో పడి, ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వీరు అనూహ్యంగా నాలుగేళ్లకే విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.. విడాకుల తర్వాత నాగచైతన్య కెరియర్ పై దృష్టి పెడుతూనే, వ్యక్తిగతంగా ఒక అడుగు ముందుకు వేశారు. అందులో భాగంగానే విడాకులు ప్రకటించిన మరుసటి ఏడాదే ప్రముఖ బ్యూటీ శోభిత ధూళిపాళ తో ప్రేమలో పడి, ఆమెతో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ వినిపించినా.. దీనిపై నోరు మెదపలేదు. అలా రెండేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట, ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకొని తమ బంధాన్ని నిజం చేశారు.
నాగచైతన్య సినిమాలు..
ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే, ఇప్పటివరకు ఈయన కెరియర్ లో ఒక్కటి కూడా సూపర్ హిట్ లేదనే చెప్పాలి. అందుకే సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా తండేల్
సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగచైతన్య. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని, ముఖ్యంగా నాగార్జున (Nagarjuna )కెరియర్ లో ‘శివ’ ఎలాగో.. నాగచైతన్య కెరియర్ లో తండేల్ సినిమా అలా అని , ఐదు ఆయన సినీ కెరియర్ లో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని సమాచారం.ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.