BigTV English

Thandel: నెట్ ఫ్లిక్స్ చేతికి తండేల్.. చై కెరీర్ లోనే మొదటిసారి.. ?

Thandel: నెట్ ఫ్లిక్స్ చేతికి తండేల్.. చై కెరీర్ లోనే మొదటిసారి.. ?

Thandel: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం పాన్ ఇండియా గుర్తింపు కోసం కష్టపడుతున్నాడు. అక్కినేని హీరోలు ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్ వరకు వెళ్ళింది లేదు. ప్రస్తుతం చై మాత్రం ఆ లెవెల్ కు వెళ్లడానికి పరితపిస్తున్నాడు. ఇందులో భాగంగానే చై నటిస్తున్న చిత్రం తండేల్. కార్తికేయ 2 తో హిట్ అందుకున్న చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చై సరసన సాయిపల్లవి నటిస్తోంది.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 20 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి నుంచి తండేల్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. తండేల్ ఓటిటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందంట.

చై మార్కెట్ కు మించి అంటే.. దాదాపు రూ. 40 కోట్ల కంటే ఎక్కువగానే ఖర్చుపెట్టి నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. నిజం చెప్పాలంటే చై కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ రికార్డ్. ఇప్పటివరకు చై ఏ సినిమా ఓటిటీకి ఇంత ధర పలకలేదు. అందులోనూ ఈ మధ్య టాప్ లో ఉన్న నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను కొన్నది అంటే అది కచ్చితంగా హిట్ అనే అభిమానులు నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతో చై తన పాన్ ఇండియా గోల్ ను రీచ్ అవుతాడో లేదో చూడాలి.


Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×