Big Stories

NVS Recruitment 2024: నవోదయ విద్యాలయాల్లో 1,377 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్..!

NVS Non Teaching Recruitment 2024: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇటీవలే పలు ఉద్యోగాల భర్తీ కోసం నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మరికొన్ని గంటలు మాత్రమే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

నవోదయ విద్యాలయ సమితి (NVS) రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇటీవలే 1,377 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎలా దరఖాస్తు చేయాలి.. వంటి పూర్తి తెలుసుకుందాం రండి..

- Advertisement -

నవోదయ విద్యాలయ సమితి మొత్తం 1,377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెస్ హెల్పర్, ఎమ్‌టీఎస్‌తో పాటుగా పలు విభాగాల్లో ఖాళీలను రిక్రూట్‌మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది.

దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పోస్టును బట్టి.. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటుగా ఆయా విభాగంలో పనిచేసే అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: రైల్వేలో 4,660 పోలీసు ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా మరి..!

అయితే అభ్యర్థులు ఇక్కడే ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ ఉద్యోగాల దరఖాస్తు స్వీకరణకు ఏప్రిల్ 30వ తేదీని చివరి తేదీగా రిక్రూట్ మెంట్ బోర్డ్ నిర్ణయించింది. రూ. 500 దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి. అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్, ఇంటర్య్వూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://navodaya.gov.in/nvs/en/Home1 వెబ్ సైట్ చూడవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News