BigTV English
Advertisement

Pushpa2 : పుష్ప రాజ్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా.. ఇక పండగ చేసుకోండి..!!

Pushpa2 : పుష్ప రాజ్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా.. ఇక పండగ చేసుకోండి..!!

Pushpa2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2.. ఇక గత ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఈ మూవీ థియేటర్లలో కొనసాగుతుంది. ఒకవైపు మౌత్ టాక్ తో పాటుగా మరోవైపు బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్స్ ను అందుకుంది. పుష్ప రాజ్ దెబ్బకు తెలుగుతో పాటుగా నార్త్ లో కూడా మంచి టాక్ ను అందుకుంది. కలెక్షన్ల పరంగా ఈ మూవీ దుమ్ము దులిపేసింది. అయితే థియేటర్లలో చూసిన ఫ్యాన్స్ సైతం ఓటీటీలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే బన్నీ ఫ్యాన్స్ కు డబుల్ బొనంజా అని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం..


పుష్ప 2 .. 

అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వల్ గా ఈ సినిమా వచ్చింది. ఆ సినిమా నేషనల్ వైట్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఆ సినిమాకు సీక్వెల్ గా రీసెంట్ గా పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. మొదటి పార్ట్ కంటే భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు భారీ బడ్జెట్ తో వచ్చిన ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా రికార్డ్లను బ్రేక్ చేస్తూ వచ్చింది. ఒకవైపు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతు మరోవైపు కోట్లు రాబట్టింది. సినిమా వచ్చి రెండు నెలలు అవుతున్నా కూడా ఈ సినిమాకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకుంది..


ఓటీటీ సర్ ప్రైజ్..

ఈ మూవీని ఓటిటిలో చూసేందుకు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.. ఆ సమయం రానే వచ్చింది.. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ నిన్న అర్ధరాత్రి నుంచి స్రీమింగ్ వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రేట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందన్న విషయం తెలిసిందే.. థియేటర్లలో రిలీజ్ అయిన వర్షన్ కాకుండా ఓటిటిలో ఇంకాస్త యాడ్ అయినట్టు ఫాన్స్ కి డబల్ బోనంజా అంటూ  ఓటీటీ సంస్థ  నెట్ఫ్లిక్స్ అధికారకంగా ప్రకటించింది. ఓటీటీ ఆడియన్స్ కి రీ లోడెడ్ వెర్షన్ ని అప్లోడ్ చేయబోతున్నారు. అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మధ్య ఒక సాంగ్ ని చిత్రీకరించారట.. సినిమా రన్ టైం ఎక్కువగా ఉండడంతో ఆ సాంగ్ ని మేకర్స్ లేపేసారని తెలుస్తుంది ఇప్పుడు ఓటీటీలో ఆ సాంగ్ కూడా రాబోతుందని ప్రకటించింది. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×