OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో హాలీవుడ్ సినిమాలకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, వదలకుండా చూస్తూ ఎంటర్టైన్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరోకి కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి. అతని దగ్గర ఎవరు ఉన్నా వాళ్లకు ఉన్న రోగాలు నయమైపోతుంటాయి. ఈ డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? పేరు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీలలో
ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘ది హీలర్‘ (The Healer). 2016లో విడుదలైన ఈ స్పానిష్ కామెడీ డ్రామా మూవీకి పాకో అరాంగో దర్శకత్వం వహించారు. ఇందులో ఆలివర్ జాక్సన్, కోహెన్, కెమిల్లా లుడింగ్‌టన్, కైట్లిన్ బెర్నార్డ్, జార్జ్ గార్సియా, జోనాథన్ ప్రైస్ నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో సినిమా (Jio cinema), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక ఎలక్ట్రిషన్ పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతనికి అప్పులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటాడు. బ్యాంకులో లోన్ తీసుకొని అప్పులు తీర్చాలనుకుంటాడు. అయితే బ్యాంకు అతనికి అప్పు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఈ క్రమంలోనే ఇతని చిన్న తండ్రి, తనకి సహాయం చేయడానికి వస్తాడు. అసలు తనకి చిన్న తండ్రి ఉన్నాడన్న విషయమే హీరోకి తెలియదు. అదే విషయం అతన్ని అడుగుతాడు హీరో. మీ నాన్న చనిపోయిన తర్వాత నేను ఇక్కడికి రావడం మానేశాను. నువ్వు నేను చెప్పిన ప్లేస్ లో ఒక సంవత్సరం పాటు ఉంటే, నీ అప్పులు తీర్చి నీకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తానని చెప్తాడు. మొదట అందుకు నిరాకరించినా, అప్పుల బాధ తట్టుకోలేక సరేనని ఒప్పుకుంటాడు. ఆ ఊరికి వెళ్ళాక ఇంట్లో తన తాతలనాటి ఫోటోలను చూస్తూ ఆనందిస్తాడు. అక్కడే హీరోయిన్, హీరోకి పరిచయమవుతుంది. హీరో ఎలక్ట్రిషన్ పని చేసుకోవడానికి పేపర్లో ఒక యాడ్ కూడా ఇస్తుంది హీరోయిన్. అయితే ఆ యాడ్ హీలర్ పేరుతో ఇవ్వడంతో, చాలామంది పేషెంట్లు హీరో డాక్టర్ అనుకుని వస్తారు. అయితే తను డాక్టర్ కాదని మొత్తుకొని అందరికీ చెప్తాడు.
ఈ క్రమంలోనే హీరో దగ్గరికి వచ్చిన పేషంట్లకి జబ్బు నయమైపోతుంటుంది. అతన్ని ఆ ప్రాంతంలో దేవుడిగా కొలుస్తారు. హీరో వీళ్ళందరికీ పిచ్చి పట్టిందని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో చిన్న తండ్రి వచ్చి, నీకు నిజంగానే పవర్స్ వున్నాయని చెప్తాడు. ఈ పవర్స్ మన ఫ్యామిలీలో మూడు జనరేషన్లకు ఒకసారి వస్తూ ఉంటుందని, అది ఇప్పుడు నీకు వచ్చిందని చెప్తాడు. 30 సంవత్సరాల నిండే లోపు నీకు ఈ పవర్స్ కావాలనుకుంటే ఉంటాయి, వద్దనుకుంటే వెళ్లిపోతాయని చెప్తాడు. అదే రోజు ఆ సమయం దాటిపోతూ ఉండటంతో హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ పవర్స్ వద్దని మనసులో గట్టిగా అనుకుంటాడు. చివరికి అతనికి ఉన్న పవర్స్ పోతాయా? హీరోని, హీరోయిన్ లవ్ చేస్తుందా? హీరో చివరికి తన అప్పులను తీర్చుకుంటాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ‘ది హీలర్’ (The Healer) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.