Kamal Haasan:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో గా పేరు సొంతం చేసుకున్న కమలహాసన్ (Kamal Haasan) ‘లోకనాయకుడు’ అనే బిరుదు కూడా పొందినవిషయం తెలిసిందే. తన అద్భుతమైన నటనతో కన్నడ, హిందీ, తెలుగు, తమిళ్ అంటూ భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఏడుపదుల వయసులో కూడా వరుసగా సినిమాలు ప్రకటిస్తూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కమలహాసన్.. ప్రస్తుతం మణిరత్నం (Maniratnam ) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Simbu), ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) , అభిరామి (Abhirami) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొంటున్న కమలహాసన్ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఆయనకే కౌంటర్ ఇచ్చారు ఒక నెటిజన్.
దయచేసి మీరు రిటైర్మెంట్ తీసుకోండి.. కమల్ కి నెటిజన్ ఝలక్..
తాజాగా కమలహాసన్ నాకంటే ఉత్తమ నటులు నలుగురు కనిపిస్తే వెంటనే ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటిస్తాను. ఆరోజే నా చివరి నటన అంటూ కామెంట్ చేయగా.. ఇప్పుడు మీరు భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన పని లేదు. ఆ నలుగురు ఉత్తమ నటులు వీరే అంటూ ఫహద్ ఫాజిల్ (Fahad fazil), ఎన్టీఆర్(NTR), విక్రమ్(Vikram), రణబీర్ (Ranbir) పేర్లు ప్రస్తావిస్తూ కమలహాసన్ కి ఆ నెటిజన్ ఝలక్ ఇచ్చారు. ప్రస్తుత హీరోలు లేదా భవిష్యత్తులో ఎవరైనా నాకంటే గొప్ప నటులు కనిపిస్తే రిటైర్మెంట్ ప్రకటిస్తానన్నారు కదా.. వచ్చే జనరేషన్ వరకు అవసరం లేదు.. ఈ జనరేషన్లోనే ఈ నలుగురు మీ కంటే కూడా చాలా గొప్పగా నటిస్తారు.. కాబట్టి మీరు హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటూ సదరు నెటిజన్ తన అభిప్రాయంగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ నెటిజన్ కమలహాసన్ కి గట్టి ఝలక్ ఇచ్చారంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
అసలు ఏం జరిగిందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన సినిమా రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ..” ప్రస్తుత జనరేషన్లో లేదా వచ్చే జనరేషన్లో నాకంటే బాగా నటించగలిగే నలుగురు హీరోలు కనిపిస్తే, వెంటనే నేను రిటైర్మెంట్ ప్రకటిస్తాను. ఇక ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ కమలహాసన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పలువురు అభిమానులు మీకంటే గొప్పగా నటించేవారు మరొకరు లేరు అని కామెంట్లు చేయగా.. ఇప్పుడు ఒక నెటిజన్ ఏమో ఆ నలుగురు హీరోల పేర్లు ప్రస్తావిస్తూ రిటైర్మెంట్ తీసుకోమని డైరెక్ట్ గా తెలిపారు. ఇక ఏది ఏమైనా కమలహాసన్ కి ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం అని చెప్పవచ్చు. మరి దీనిపై కమలహాసన్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారు చూడాలి.
ALSO READ:Hero Simbu: శింబుతో ప్రేమలో పడ్డ టాలీవుడ్ హీరోయిన్..క్లారిటీ ఇచ్చిన పవన్ బ్యూటీ!
Fahadh Fasil, Vikram, NTR, Ranbir
now please retire sir 🙏 https://t.co/xMX9GeNr13— 𝘿 (@Vk18xCr7) May 31, 2025