Lakshmi Narasimha Re Release Date: నందమూరి నటసింహం బాలయ్య నటించిన హిట్ సినిమాలలో ఒకటి లక్ష్మి నరసింహ.. ఈమధ్య స్టార్ హీరోలు సినిమాలు మరోసారి థియేటర్లలో రిలీస్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే స్టార్ హీరోలు సినిమాలు బోలెడు రిలీజ్ అయ్యి మరోసారి సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు నందమూరి స్టార్ హీరో బాలయ్య బర్త్ డే సందర్బంగా ఆయన నటించిన లక్ష్మీ నరసింహ మూవీ రీరిలీజ్ కు సిద్ధంగా ఉంది.. ఈ మూవీ ఎప్పుడు థియేటర్లలోకి రాబోతుందో ఒకసారి చూసేద్దాం.
థియేటర్లలోకి లక్ష్మీ నరసింహ.. ఎప్పుడంటే..?
ఈ నెల 7న బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. దాంతో పాటుగా నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ సినిమా ఆయన పుట్టినరోజుకి మూడు రోజులు ముందుగానే థియేటర్లలో రీరిలీజ్ కాబోతుంది. నైజాం తో పాటు ఉత్తరాంధ్రలో ఈ సినిమాను అగ్ర నిర్మాత ‘దిల్’ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తోంది. ‘లక్ష్మీ నరసింహ’కు జయంతి సి పరాంజి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ ఆసిన్ నటించింది.. తమిళంలో విజయం సాధించిన చియాన్ విక్రమ్ ‘సామి’కి తెలుగు రీమేక్ ఇది. అయితే బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్ కథలో కొన్ని మార్పులు, పాటలు పూర్తిగా మార్చేసి థియేటర్లోకి తీసుకొచ్చారు. ఆ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఆయన చెప్పే ప్రతి డైలాగు థియేటర్లలో విజిల్ వేయించింది. ఇప్పుడు ఆ సినిమాని మరోసారి చూడాలనుకునే వారికి ఈ సినిమాను జూన్ 4 థియేటర్లలో చూసేయ్యచ్చు..
Also Read : పబ్ మేనేజ్మెంట్, కల్పిక మధ్య లొల్లి పై పోలీసులు ఏమంటున్నారంటే..?
అఖండ 2 నుంచి అప్డేట్ రాబోతుంది..?
ఈ ఏడాది బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ మాత్రం బాగానే వసూల్ చేసింది. ఇక ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే.. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను తనకు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ రెండు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన విడుదల కానుంది. తొలుత ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేసినా కూడా అది కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.. ఈ మూవీ కోసం యావత్ సినీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. మూవీని సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ చెయ్యనున్నారు.