Viral Video: ఈ మధ్యకాలంలో వైరల్ వీడియో బాగా ఫేమస్ అవుతున్నాయి. అందులో ఏమీ లేకపోయనా సోషల్‌మీడియాలో గిరగిరా చక్కర్లు కొట్టేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆక్సిజన్ మాస్క్ లేకుండా వింటర్ దుస్తులు లేకుండా అత్యంత శీతల ప్రాంతంలో ఓ వ్యక్తి పారా గ్లైడింగ్ చేస్తున్న దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొన్ని వీడియోల విషయంలో ఏది నిజం కాదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరహా వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగ హంగామా చేస్తోంది. చైనీస్‌కు చెందిన 55 ఏళ్ల పారాగ్లైడింగ్ అత్యంత ఎత్తులో కనీసం ఆక్సిజన్ మాస్క్ లేకుండా వింటర్ ఏరియాలో విన్యాసాలు చూపరులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
తొలుత ఆ వ్యక్తి 3,000 మీటర్ల ఎత్తులో ప్రయాణానికి బయలు దేరినట్టు చైనా పత్రికలు పేర్కొన్నాయి. ఊహించని పరిస్థితుల కారణంగా సముద్ర మట్టానికి దాదాపు 5,000 మీటర్ల ఎత్తుకు వెళ్లాడట. ఆ స్థాయి ఎత్తులో అంటే ఆక్సిజన్ స్థాయిలు బాగా పడిపోతాయి. ఉష్ణోగ్రతలు -40°Cకి పడిపోయాయి.
ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా కఠినమైన మంచు చలిని భరించినట్లు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. పారాగ్లైడింగ్ ముఖం, వేళ్లపై మంచు కనిపించడంతో అతని చేతులు మొద్దు బారినట్లు దర్శినమిచ్చాయి. 72 నిమిషాల విమాన ప్రయాణాన్ని రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
ALSO READ: టర్కీ మహిళపై కామెంట్స్.. ఇబ్బందుల్లో ఓ భారతీయుడు, ఏం జరిగింది?
పారాచూట్ బ్యాకప్ లేకుండా చూపించడంతో అది ప్రమాదకరంగా కనిపించింది. దీనికి సంబంధించి ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పారాగ్లైడింగ్ ఆరోగ్యం ఏంటి అంటూ చర్చించడం మొదలైంది. విచిత్రం ఏంటంటే.. ఇది ఐఏ జనరేటెడ్ వీడియో మాత్రమే.
Chinese paraglider survives freezing death as updraft yanks him into subzero clouds 1,000s meters above sea level
-40C ordeal over Qilian Mountains reportedly led to accidental breaking of an altitude record
No oxygen & coated in ice, flight suspension seems like a needed rest pic.twitter.com/aTwjZBWc4G
— RT (@RT_com) May 28, 2025