Hero Simbu: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగి, తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు. దశాబ్దాలుగా సినీ రంగంలో హీరోగా కొనసాగుతున్న శింబు.. ప్రస్తుతం మణిరత్నం (Maniratnam), కమలహాసన్ (Kamal Haasan) కాంబినేషన్లో 38 ఏళ్ల తర్వాత వస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా శింబు ఒక టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరికీ వివాహం కూడా జరగబోతోంది అంటూ ఇండస్ట్రీలో వార్తలు కోడైకూసాయి. ఈ వార్తలకు తోడు అటు హీరో ఇటు హీరోయిన్ ఎవరు స్పందించకపోవడంతో పెళ్లి వార్తలు నిజమేనని అందరూ ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇలా వార్తలు రోజు రోజుకి దావాణంలా విస్తరిస్తున్న వేళ సదరు హీరోయిన్ స్పందిస్తూ వార్తలకు చెక్ పెట్టింది.
శింబుతో ప్రేమ, పెళ్లి పై నిధి అగర్వాల్ క్లారిటీ..
ఆమె ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal). ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఈమె కోలీవుడ్ లో హీరో శింబు తో కలసి ‘ఈశ్వరన్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. నిధి అగర్వాల్ మాట్లాడుతూ..” సాధారణంగా ఒక హీరోయిన్ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆమె గురించి ఇలాంటి ఎన్నో పుకార్లు వస్తాయి. ముఖ్యంగా వివాహం గురించి రావడం అత్యంత సాధారణం. ఎందుకంటే జనాలు కూడా ఎక్కువగా రూమర్స్ పైనే ఆసక్తి కలిగి ఉంటారు. అది త్వరగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే నేను మాత్రం ఇలాంటి వాటిని పట్టించుకోను. నా గురించి కూడా ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది” అంటూ శింబు తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై స్పందించింది నిధి అగర్వాల్. మొత్తానికైతే నిధి అగర్వాల్ మాటలతో పెళ్లి రూమర్స్ కి కాస్త బ్రేక్ పడిందని చెప్పవచ్చు.
నిధి అగర్వాల్ సినిమా..
నిధి అగర్వాల్ చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. జూన్ 12వ తేదీన సినిమా విడుదలకు సిద్ధం కాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో 2001లోనే ఈ సినిమా ప్రారంభమైంది. కానీ కరోనా లాక్ డౌన్ , పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు హరిహర వీరమల్లు మొదటి భాగం పూర్తి కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఏం రత్నం నిర్మాణంలో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని యూనిట్ తెగ ఆరాటపడుతోంది.. మరి ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
also read:Samantha Subham OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన సమంత శుభం మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?