E-Paper
Advertisement

Sai Dharam Tej: అల్లుడు గారు ఎక్కడ.. ఇప్పుడు లేవదేంటీ మీ నోరు.. ?

Sai Dharam Tej: అల్లుడు గారు ఎక్కడ.. ఇప్పుడు లేవదేంటీ మీ నోరు.. ?
Advertisement

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మెగా మేనల్లుడు గా తేజ్ కు ఉన్న  గుర్తింపు వేరు. ఇప్పుడు అతనికి ఉన్న గుర్తింపు వేరు. అందుకు కారణం తేజ్ చిన్నమామ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. చిన్నతనం నుంచి తేజ్ కు అన్ని పవనే. ఆయనను చూస్తూనే పెరిగాడు. ఆయనను అనుకరిస్తూనే  సినిమాల్లోకి వచ్చాడు. ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకున్నా..  విజయాలను మాత్రం చాలా తక్కువ దక్కించుకున్నాడు.

ఇక రెండేళ్ల క్రితం తేజ్ కు జరిగిన యాక్సిడెంట్ అతని జీవితాన్నే మార్చేసింది.  చావు అంచుల వరకు వెళ్లివచ్చిన తేజ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. విరుపాక్ష సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ కుర్ర హీరో..  ఈ మధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఒక తండ్రీకూతుళ్లకు సంబంధించిన ఒక వీడియోను యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు ఫ్రెండ్స్ తో అసభ్యకరమైన మాటలతో రోస్ట్ చేశాడు. ఆ వీడియోను తేజ్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

Advertisement

Jani Master: టాలీవుడ్ లో హేమా కమిటీ.. జానీ కేసుతోనే మొదలు కానుందా.. ?

తేజ్ అలా పోస్ట్ చేశాడో లేదో.. ఇలా వైరల్ గా మారిపోవడంతో పాటు స్టార్ సెలబ్రిటీలు అందరూ తేజ్ కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. చివరికి ప్రభుత్వం కూడా ఈ వివాదంపై స్పందించి ప్రణీత్ హన్మంతును అతని ఫ్రెండ్స్ ను అరెస్ట్ చేశారు.  ఇక ఈ ఘటన తరువాత  సీఎం రేవంత్ రెడ్డి, తేజ్ ను స్వయంగా కలిసి అభినందించారు. ఇక ఒక చిన్న వీడియో గురించే  తేజ్ ఆ రేంజ్ లో  పోరాటం చేస్తే.. జానీ మాస్టర్ పై ఒక  డ్యాన్సర్  తనను లైంగికంగా వేధించాడు. క్యార్ వ్యాన్ లో రేప్ చేశాడు అని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తేజ్ ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు ఎందుకు.. ? అని నెటిజన్స్  ఫైర్ అవుతున్నారు.

Advertisement

Bigg Boss Rathika: వైట్ డ్రెస్‌లో ‘బిగ్ బాస్’ బ్యూటీ అందాలు.. మహారాణిలాగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్

ఇప్పటికే  జనసేన కార్యక్రమాల నుంచి జానీ తొలగించినట్లు పవన్ కళ్యాణ్  స్వయంగా తెలిపారు. మరి మామనే అలాంటి నిర్ణయం తీసుకుంటే.. అల్లుడు కనీసం ఇది తప్పు అని ప్రశ్నించకపోవడానికి కారణం ఏంటి.. ? అంటే ఆ వీడియో గురించి మాట్లాడింది కేవలం ఫేమస్ అవ్వడానికా.. ? జానీ మాస్టర్   వారి కుటుంబానికి కావాల్సినవాడు కాబట్టి తేజ్ మౌనం  వహించడా.. ? ఇదేనా తేజ్.. నీ అసలు స్వరూపం అని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు.  ఈ వివాదంపై అల్లు అర్జున్ సైతం స్పందించి తన మద్దత్తు తెలిపినప్పుడు.. నీకేమైంది.. నువ్వెక్కడ ఉన్నావ్.. ఇలాంటివి  నీకు  కనిపించడం లేదా.. ? అని  ఇష్టానుసారంగా తిట్టిపోస్తున్నారు. మరి ఈ వివాదంపై తేజ్ ఇప్పుడైనా స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×