BigTV English

Akkineni Naga Chaitanya: ఈ మాత్రం బుద్ది సమంతకు లేదు.. సింపతీ కోసం డ్రామాలు..?

Akkineni Naga Chaitanya: ఈ మాత్రం బుద్ది సమంతకు లేదు.. సింపతీ కోసం డ్రామాలు..?

Akkineni Naga Chaitanya: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత త్వరగా అవుతున్నాయో.. అంతకన్నా  త్వరగా వారి విడాకులు అయిపోతున్నాయి. రెండు సినిమాలు కలిసి చేయడం.. ఆ సమయంలోనే ప్రేమలో పాడడం ఇంకో రెండేళ్లు డేటింగ్ చేయడం.. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. అక్కడితో కథ సుఖాంతం అవుతుంది అనుకొంటే పొరపాటే. అక్కడ నుంచే కొత్త కథ మొదలవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట  ఎక్కువ కాలం కలిసి ఉండడం లేదు. పెళ్లి అయిన ఏడాది సంతోషంగా ఉన్నా.. ఆ తరువాత విభేదాలతో కలిసి ఉండలేక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ప్రస్తుతం  ఇండస్ట్రీలో ఇదొక ఫ్యాషన్ గా మారిపోయింది.


ఇక  టాలీవుడ్  టాప్ ఫ్యామిలీస్ లో అక్కినేని కుటుంబం ఒకటి.  అక్కినేని నాగార్జున నటవారసుడిగా  జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నాగచైతన్య. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన రెండో సినిమా ఏ మాయ చేసావే భారీ హిట్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతను చై ప్రేమించి పెళ్లాడాడు. ఈ జంట పెళ్లి చేసుకోవడం వారికి ఎంత హ్యాపీగా అనిపించిందో తెలియదు కానీ అభిమానులు మాత్రం తమ సొంత అన్నావదినలకు పెళ్లి చేసినంత ఆనందాన్ని పొందారు.

పెళ్లి తరువాత సామ్- చై  ఎక్కడ కనిపించినా వారిని ఎంతో గౌరవించేవారు. ఎప్పుడెప్పుడు ఈ జంట తల్లిదండ్రులు అవుతారా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. చై సినిమా వస్తే సామ్ గురించి.. సామ్ సినిమా రిలీజ్ అయితే చై గురించి అడిగి.. వారి దాంపత్యం మంచిగా ఉందో లేదో అని తెలుసుకుంటే ఉండేవారు. అన్ని మంచిగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది.   నాలుగేళ్ళ వీరి దాంపత్య జీవితంలో విభేదాలు పెరిగి.. అది విడాకుల వరకు దారితీసింది.


Critics Choice Awards : ‘సిటాడెల్: హనీ బన్నీ’, ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ అవుట్… క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును ఎగరేసుకుపోయిన బెస్ట్ మూవీ ఇదే

2021 లో  సామ్, చై మ్యూచువల్ విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా ఎప్పటికి ఉంటామని తెలిపారు. అంతే.. ఆరోజు నుంచి ఈరోజు వరకు వారిద్దరి విడాకుల విషయం సోషల్ మీడియా సెన్సేషన్ గానే ఉంది. వీరు విడాకులు తీసుకున్నాకా ఇప్పటివరకు దాని గురించి ఇంటర్వ్యూ లో కానీ, ప్రెస్ మీట్ పెట్టి కానీ.. అసలు ఎందుకు విడిపోయారు అన్నది చెప్పింది లేదు. ఆ అవసరం వారికి కూడా లేదు. కానీ, నెటిజన్స్ మాత్రం.. రకరకాలుగా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.

సామ్ ఎఫైర్ పెట్టుకుందని కొందరు.. కాదు చై వేరొకరితో ఉన్నాడని ఇంకొందరు.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వలనే విడిపోయారని మరికొందరు.. డబ్బులు కోసం సామ్ టార్చర్ పెట్టారని మరికొందరు.. ఇలా ఒక కారణం అని లేకుండా.. నోటికి ఏది వస్తే  అది చెప్పేస్తూ సామ్ ను ఒకపక్క చైను మరోపక్క ట్రోల్స్ చేస్తూనే వచ్చారు. ఇంత జరిగినా కూడా వారిద్దరూలో ఏ ఒక్కరు వీటిపై రియాక్ట్ అయ్యింది లేదు.  ఇక విడాకులు అయ్యాక కూడా చైతన్య .. సామ్ గురించి పాజిటివ్ గానే మాట్లాడేవాడు. తనకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడు సామ్ తోనే బావుంటుందని, తన ఫేవరేట్ కో స్టార్  సామ్ అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.

సమంత మాత్రం విడాకుల తరువాత చై పేరు ఏరోజు ఎత్తింది లేదు. మీ భర్త అంటే కూడా భర్త కాదు మాజీ భర్త అని చెప్పుకొచ్చింది.  అంతేనా ఒకే రూమ్ లో ఇద్దరినీ ఉంచి పక్కన కత్తి ఉంటే యుద్ధాలే జరిగిపోతాయని చెప్పింది. ఎన్నోసార్లు ఇన్ డైరెక్ట్ గా చైపై, అతనితో ఉన్న రిలేషన్ పై కోట్స్  పెడుతూ వచ్చింది. అంతేకాకుండా చైకు ఎంతో ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చానని, అవన్నీ తాను ప్రేమ అనే మత్తులో చేసిన వేస్ట్ ఖర్చులు అన్నట్లు చెప్పుకొచ్చింది. చై వేరొక పెళ్లి చేసుకున్నాడు అంటే అసూయ పడాల్సిన అవసరం కూడా తనకు లేదని కొట్టొచ్చినట్లు చెప్పుకొచ్చింది.

Big TV Exclusive : రానా డైరెక్టర్‌తో గోపీచంద్ మూవీ… సెట్ అయితే బ్లాక్ బస్టర్ అయినట్టే..?

ఇక తాజాగా చై .. తన విడాకుల విషయం మాట్లాడిన విషయం తెల్సిందే. అదొక ఎంటర్ టైన్మెంట్ న్యూస్ అయిపోయిందని, తాము చెప్పినా.. చెప్పకపోయినా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారని, ఇద్దరం మ్యూచువల్ గా విడిపోయాం. ఇప్పుడు నేను వేరొకరిని పెళ్లి చేసుకున్నాను.. ఎవరి కెరీర్ లు వాళ్ళు చూసుకుంటున్నాం. ఇది మా వ్యక్తిగత విషయమని, ప్రైవసీ ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా కూడా దీనిని ఒక ఎంటర్‌టైన్మెంట్ లాగా చూస్తున్నారు. ఇకనైనా వీటికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చై కోరాడు.

ఇక చై చెప్పిన విధానం నెటిజన్స్ ఆకట్టుకుంటుంది. తాము పడిన బాధను ఎంతో క్లారిటీగా చెప్పుకొచ్చాడు. కానీ, సామ్ మాత్రం ఇంకా  సింపతీ కోసం డ్రామాలు ఆడుతుంది. మయోసైటిస్ అంటుంది..  పబ్స్ లో డ్యాన్స్ వేస్తూ కనిపిస్తుంది. విడాకులు తీసుకున్నాకా.. చై అసలు మనిషే కాదన్నట్టు మాట్లాడుతుంది. ఇదేనా పద్దతి.. చైలానే ఆమె కూడా దీనిపై ఒక క్లారిటీ ఇస్తే  ఈ రూమర్స్ ఎప్పుడో ఆగి ఉండేవి. ఆ మాత్రం బుద్ది సామ్ కు లేదా.. ? అని నెటిజన్స్ ట్రోల్స్  చేస్తున్నారు. మరి చై వ్యాఖ్యలపై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×