Big TV Exclusive.. మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichandh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చాలా సినిమాలలో నటించారు కానీ సరైన కంబ్యాక్ మాత్రం ఆయన ఖాతాలో పడలేదని చెప్పవచ్చు. ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం సినిమాతో బ్రేక్ ఇస్తాడని అనుకున్నారు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. అంతకుముందు భీమా కమర్షియల్ గా జస్ట్ ఓకే అనిపించుకుంది కానీ హిట్ అయితే పడలేదు. అంతకుముందు వచ్చిన పక్కా కమర్షియల్, ఆరడుగుల బుల్లెట్, చాణక్య, పంతం వంటి చిత్రాలు డిజాస్టర్ గానే నిలిచాయి. తన వరకు గోపీచంద్ ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డారు. అయినా సరే ఆయన ఖాతాలో హిట్ అయితే పడలేదు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు రానా(Rana ) డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు గోపీచంద్.
చర్చల దశలో ఉన్న రానా డైరెక్టర్ తో గోపీచంద్ మూవీ..
ఆయన ఎవరో కాదు రానా తో ‘ఘాజీ’సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న సంకల్ప్ రెడ్డి(Sankalp Reddy) తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు చిత్తూరు శ్రీను ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, త్వరలోనే ఈ సినిమా సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘాజీ సినిమా విషయానికి వస్తే.. 2017 ఫిబ్రవరి 17న రానా హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. సముద్రం లోపల జరిగే పోరాటంతో తొలిసారి వచ్చిన సినిమా కూడా ఇదే. అంతే కాదు 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా పురస్కారం కూడా లభించింది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక హిందీ, తమిళంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు.. ఈ సినిమా డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా చేసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథ ఓకే అయ్యి పట్టాలెక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గోపీచంద్ కెరియర్..
తొట్టెంపూడి గోపీచంద్ గా కెరియర్ను ఆరంభించిన ఈయన ‘తొలివలపు’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జయం, నిజం, వర్షం వంటి సూపర్ హిట్ చిత్రాలలో విలన్ గా నటించి, ఆ తర్వాత మళ్లీ కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. ఇకపోతే గోపీచంద్ హీరోగా చేసిన యజ్ఞం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేశారు కానీ ఇప్పుడు సరైన సక్సెస్ లేక సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సంకల్ప్ రెడ్డి తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి గోపీచంద్ కి సంకల్ప్ రెడ్డి ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి. ఏది ఏమైనా చిత్తూరు శ్రీను నిర్మాణంలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ గనుక సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని గోపీచంద్ తన కెరియర్లో మళ్ళీ కం బ్యాక్ అవుతారని కామెంట్లు చేస్తున్నారు.