OTT Movie : ఒకప్పుడు ‘కొత్త బంగారు లోకం’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ గా మారింది శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad). ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఓ కామెడీ క్రైం థ్రిల్లర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ‘ఊప్స్ !అబ్ క్యా ?’ (Oops Ab Kya) అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఎలా ఉందంటే…
శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) ఫిమేల్ లీడ్ గా నటించిన వెబ్ సిరీస్ ‘ఊప్స్ ! అబ్ క్యా ?’ (Oops Ab Kya). టైటిల్ కి తగ్గట్టే ఈ సిరీస్ లో యూత్ ఫుల్ అంశాలు గట్టిగానే ఉన్నాయి. ట్రైలర్ ను చూస్తుంటే మరోసారి ఈ సిరీస్ తో శ్వేతా బసు ప్రసాద్ నెట్టింట్లో ట్రెండ్ కావడం ఖాయం అనిపిస్తోంది. ట్రైలర్ లో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయి, అనుకోకుండా తన బాస్ స్పె*ర్మ్ తో తల్లి అవుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్లిన హీరోయిన్ కు ఆ తర్వాత షాక్ ఇచ్చే విషయం ఒకటి తెలుస్తుంది. మరో అమ్మాయిలోకి ఇన్సర్ట్ చేయాల్సిన స్పె*ర్మ్ ను హీరోయిన్ లోకి పంపిస్తుంది కన్ఫ్యూజన్లో డాక్టర్. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. నిజానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ, ఆమె తన అమ్మమ్మ చెప్పిన మాటను గుర్తు పెట్టుకొని ఎప్పుడూ అతనికి దగ్గరగా ఉండదు. అలాంటిది తాను తల్లి ఎలా కాబోతుందో ఆమెకు అసలు అర్థం కాదు.
ఇక మిస్టేక్ ఎక్కడ జరిగిందో అర్థం చేసుకున్న తర్వాత తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న సంగతిని మర్చిపోతోంది. బాస్ తో అలాంటి కలలు కంటూ అతనిపై మనసు పారేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే బాయ్ ఫ్రెండ్ తో మనస్పర్ధలు రాగా, సడన్ గా బాస్ ఓ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడాల్సిందే.
శ్వేత ఆశలన్నీ ఈ సిరీస్ మీదే
(Oops Ab Kya) సిరీస్ కు ప్రేమ్ మిస్త్రి, దేభాత్మ మండల్ దర్శకత్వం వహించారు. డైస్ మీడియా నిర్మించగా, శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) తో పాటు ఆశిం గులాటి, జావేద్ జాఫరీ, అభయ్ మహాజన్, అపర మెహతా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక శ్వేతా బసు ప్రసాద్ ఈ ట్రైలర్ గురించి స్పందిస్తూ “ఊప్స్ అబ్ క్యా స్క్రిప్ట్ చదవగానే ఇది ఒక క్రేజీ రైడ్ కాబోతుందని అనిపించింది. కొన్ని సెకన్లలోనే ఈ రోల్ లైఫ్ తలకిందులుగా మారుతుంది. దీనికి కొంచెం కామెడీని జోడించి ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు. ఈ ప్రయాణం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ట్రైలర్లో పైపైనే చూపించాము. వెబ్ సిరీస్ ను చూసి ప్రేక్షకులు మరింత ఆనందిస్తారని ఆశిస్తున్నాను” అంటూ కామెంట్స్ చేసింది.