Courtroom Love Jihad Attack | అన్యాయం జరిగితే న్యాయపోరాటం కోసం కోర్టుకెళతాం. కానీ కోర్టులో అందరి సమక్షంలోనే దాడులు జరిగితే అప్పుడు శాంతి భద్రతలు కాపాడాల్సిన చట్టాలు పనిచేస్తున్నాయా? అనే ప్రశ్న తలెత్తుంది. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. రెండు వేర్వేరు మతాలకు చెందని యువతీయువకులు తమ ఇష్టాను సారంగానే వివాహం చేసుకోవడానికి కోర్టులో వస్తే అక్కడ కొందరు లాయర్లు వారిని.. ఓ వర్గం కార్యకర్తలకు అప్పగించారు. దీంతో ఆ అతివాదులు వరుడిని కోర్టులోనే కిందపడేసి కొట్టారు. ఇదంతా ఒకరు వీడియో తీయగా.. ఆ వీడియో వైరల్ గా మారింది. అయినా పోలీసులు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని ఓ కోర్టులో నారసింగ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం యువకుడు, పిపారియా ప్రాంతానికి చెందిన హిందూ యువతితో వివాహం చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టాడు. వివాహం కంటే కొన్ని రోజులు ముందు అతను అఫిడవిట్ నోటరీ కోసం కోర్టుకు రాగానే అతని గురించి లాయర్లు హిందుత్వ సంస్థలైన విశ్వ హిందు పరిషద్, బజ్రంగ్ దళ్ సభ్యులకు సమాచారం అందించారు.
ఆ తరువాత రెండు రోజుల క్రితం ఆ ముస్లిం యువకుడు తనకు కాబోయే భార్యతో కోర్టులోకి రాగానే వెనుక వచ్చిన కొందరు హిందుత్వ కార్యకర్తలు అతడిపై దాడి చేశారు. ఆ ముస్లిం యువకుడిని కింద పడేసి కాళ్లతో తంతూ ఉన్నారు. ఇదంతా కోర్టులో అందరూ చూస్తుండగానే జరిగింది. ఈ ఘటన తరువాత పోలీసులు వచ్చి ఆ యువకుడిని తీసుకు వెళ్లారు. అయితే ఆ యువకుడిపై జరిగిన దాడి వైరల్ కావడంతో పోలీసులు, న్యాయ వ్యవస్థపై నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఈ అంశంపై స్పందిస్తూ.. ఆ వీడియో చూశాము కానీ.. ఆ దాడి చేసింది ఎవరో తమకు ఫిర్యాదులేమీ రాలేదని చెప్పారు.
Also Read: కొడుకు పెళ్లి సందర్భంగా రూ.10 వేలు కోట్లు దానం.. గౌతం అదానీ దాతృత్వం
మరోవైపు అదే కోర్టులో ఉన్న అడ్వకేట్ రవి గోయల్ మాట్లాడుతూ.. “ఆ ప్రేమికులిద్దరూ వేరే జిల్లాకు చెందిన వారు. నేను పని చేసే కోర్టులో పెళ్లి చేసుకునేందుకు అఫిడవిట్ కోసం వచ్చారు. వారి మతాల గురించి తెలిసి మేము, మా సన్నిహితులు వారి అడ్రస్ గురించి తెలుసుకొని విశ్వ హిందూ పరిషద్ సభ్యులకు సమాచారం చేరవేశాం” అని చెప్పారు.
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, విశ్వ హిందూ పవేందర్ రాఘవ్ మాట్లాడుతూ.. “ఈ ఘటన జరిగినప్పురిషద్ మధ్య ప్రదేశ్ యూనిట్ లీగల్ హెడ్ అయిన దేడు మేమంతా అక్కడే ఉన్నాం. ఆ యువకుడిని పట్టుకున్నాం. అతడికి మంచిగా సపర మర్యాదలు చేసి పోలీసులకు అప్పగించేశాం. అతను ఆ యువతిని మభ్యపెట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమె ఇష్టానుసారంగానే పెళ్లి చేసుకుంటున్నట్లు డాకుమెంట్స్ తయారు చేసుకోవాలని ప్రయత్నించాడు” అని చెప్పారు.
సంస్కృతి బచావో మంచ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారి ఈ అంశంపై స్పందిస్తూ.. “ఆ యువకుడి ఫోన్ పరిశీలించాం. అందుకలో కొంతమంది హిందూ అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వారిని బలవంతంగా వివాహం చేసుకోవాలని అతను ప్రయత్నించాడు. ఇలా లవ్ జిహాద్ నేరం. అందుకే మధ్య ప్రదేశ్ ఫ్రీడం ఆఫ్ రెలిజియన్ చట్టం 2021 సెక్షన్ 3/5 ప్రకారం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.” అని చెప్పారు.
*ब्रेकिंग भोपाल*
*भोपाल जिला अदालत में जमकर हुआ हंगामा*
*मुस्लिम युवक की हिंदूवादी संगठन के कार्यकर्ताओं ने की पिटाई*
*हिंदूवादी संगठन ने युवक पर लगाए लव जिहाद के आरोप*
*लव जिहाद का आरोप लगाते हुए की जमकर पिटाई*
नरसिंहपुर से मुस्लिम युवक कोर्ट हिंदू लड़की को लेकर पहुंचा था। pic.twitter.com/39wGOamwQr
— tarun yadav / तरुण यादव (@CameramanTarun) February 7, 2025