Rajamouli:76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు విభాగాలలో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి, పద్మ అవార్డులతో గౌరవంగా సత్కరించబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఏడు మంది ఈ పద్మ అవార్డులకు ఎంపిక అవ్వగా.. వివిధ రాష్ట్రాల నుండీ కూడా పలువురిని ఎంపిక చేశారు. ఇకపోతే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుండి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) తో పాటు సీనియర్ స్టార్ హీరోయిన్ శోభన(Shobhana) లు పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యారు. ఇక వీరికి సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రాంతీయ భేదాలు సృష్టించొద్దంటూ నెటిజన్స్ ఫైర్..
అందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli ) కూడా పద్మ అవార్డులకు ఎంపికైన వారిని అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. రాజమౌళి పెట్టిన పోస్ట్ ప్రాంతీయ భేదాలను సృష్టిస్తోంది అని నెటిజన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇక రాజమౌళి షేర్ చేసిన పోస్టులో ఏముంది అనే విషయానికి వస్తే.. “ఈసారి ఏడుగురు తెలుగు వాళ్లకు పద్మ అవార్డులు వచ్చాయి. తెలుగుతోపాటు ఇతర భారతీయ పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు” అంటూ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇక ఆయన తన ట్వీట్ లో ఇలా పేర్కొనడంతో.. అందరూ భారతీయులే.. తెలుగు, ఇండియన్స్ అంటూ ఎందుకు మాట్లాడడం.. ప్రాంతీయ భేదాలు ఎందుకు? అంటూ పలువురు కామెంట్లు చేస్తూ.. గణతంత్ర వేళ రాజమౌళిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా రాజమౌళి దేశవ్యాప్తంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఇక్కడ కాస్త ఆయన తెలుగు కాబట్టి తెలుగుపై అభిమానం చూపించడంతో కొంతమంది దీనిని తప్పుగా తీసుకొని ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది అని మరికొంతమంది నెటిజన్స్ ఆయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం రాజమౌళి షేర్ చేసిన ఈ పోస్టు చాలా వైరల్ గా మారింది.
రాజమౌళి సినిమాలు..
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయి గుర్తింపును అందుకున్నారు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) ఇద్దరూ కూడా పోటీపడి మరీ నటించారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ లీనమైపోయి నటించారు అని చెప్పవచ్చు. వీరికి జోడిగా ఒలీవియా మోరిస్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు (Maheshbabu) తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా ఎంపికయింది. ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో నటించబోతోంది అని సమాచారం. ఇక ఈ సినిమాను కేఎల్ నారాయణ శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై రూ.1000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
7 Padma Awards for Telugu people this time… 👏🏻👏🏻👏🏻👏🏻
Heartiest congratulations to Nandamuri Balakrishna garu on being honored with the Padma Bhushan! Your journey in Indian cinema is truly commendable…
Also, congratulations to all the other distinguished Telugu & other…
— rajamouli ss (@ssrajamouli) January 25, 2025