BigTV English

VD 14: విజయ్, రష్మిక మూవీపై క్రేజీ అప్డేట్.. ఫోటోలు షేర్ చేసిన డైరెక్టర్

VD 14: విజయ్, రష్మిక మూవీపై క్రేజీ అప్డేట్.. ఫోటోలు షేర్ చేసిన డైరెక్టర్

VD 14: ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాకు షిఫ్ట్ అయిపోతున్నారు మేకర్స్. పైగా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులను ఎక్కువగా వెయిట్ చేయించడం లేదు. షూటింగ్ ప్రారంభమయినప్పటి నుండి ఏదో ఒక విధంగా దానికి సంబంధించిన అప్డేట్స్‌ను అందరికీ అందిస్తూనే ఉన్నారు. అదే విధంగా విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీ నుండి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నా.. ఆ తర్వాత ఎవరితో మూవీ చేయాలని కూడా ఫిక్స్ అయిపోయాడు. అలా తన కెరీర్‌లో 14వ మూవీకి సంబంధించిన మేజర్ అప్డేట్ బయటికొచ్చింది.


షూటింగ్ మొదలు

గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్నది తన కెరీర్‌లో 13వ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతున్నా కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ పెద్దగా బయటికి రావడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి కేవల ఒక అఫీషియల్ ఫస్ట్ లుక్ మాత్రమే విడుదలయ్యింది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ను త్వరగా పూర్తిచేసుకొని వీడీ 14పై ఫోకస్ చేయాలని ఈ రౌడీ హీరో నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే వీడీ 14కు సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేసి అసలు సినిమా థీమ్ ఏంటి అని ప్రేక్షకులంతా చర్చించుకునేలా చేశారు మేకర్స్. ఇంతలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వడానికి సిద్ధంగా ఉందని మేజర్ అప్డేట్ అందించారు.


పవర్‌ఫుల్ సినిమా

వీడీ 14 (VD 14)ను యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రాహుల్ కాంబినేషన్‌లో ‘టాక్సీవాలా’ అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే మరోసారి రాహుల్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందనా హీరోయిన్‌గా నటిస్తుందని దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్ కోసం రిపబ్లిక్ డే సందర్భంగా మొదటి ఇటుకను పేర్చామంటూ దర్శకుడు రాహుల్.. కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఇది ఎవరికీ తెలియని హిస్టరీ గురించి తెరకెక్కే పవర్‌ఫుల్ ఫిల్మ్ అవుతుంది అని రాహుల్ మాటిచ్చాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

Also Read: ప్రియాంకతో పాటు ఇంకో హీరోయిన్.. నిజమేనా?

మళ్లీ చూడాలనిపిస్తుంది

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందనా (Rashmika Mandanna).. కెరీర్ మొదట్లోనే ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి రెండు సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత కూడా మళ్లీ ఈ పెయిర్‌ను స్క్రీన్‌పై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇంతలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం బయటికి రాగా వీరి కెమిస్ట్రీని మళ్లీ స్క్రీన్‌పై చూస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ హీరోగా నటించే ప్రతీ సినిమాకు ముందుగా రష్మికనే హీరోయిన్‌గా అనుకుంటున్నా కూడా ఈ కన్నడ బ్యూటీకి ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఇప్పటివరకు వీరి కలిసి మరో సినిమా చేయలేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×