Akhanda 2 Teaser Reaction..బాలకృష్ణ (Balakrishna).. నటసింహ నందమూరి బాలకృష్ణ గా పేరు సొంతం చేసుకున్న ఈయన ఏడు పదుల వయసులో కూడా వరుస పెట్టి మాస్, యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తున్నారు. ఇక బాలయ్య గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ తన అభిమానులపై ఎంత ప్రేమనైతే చూపిస్తారో.. కోపం వస్తే అంతే రేంజ్ లో చేయి కూడా చేసుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆయన చేత దెబ్బలు తిన్న వారు కూడా ఈ విషయాన్ని సరదాగానే తీసుకుంటూ ఉంటారు. సెట్ లోనే కాదు బయట కూడా అందరితో సరదాగా ఉంటూ అందరిని నవ్విస్తూ అందరికి ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ఇకపోతే బాలయ్య పెద్దవాళ్లకే కాదు చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టమనే చెప్పాలి. అయితే ఆ ఇష్టం ఇప్పుడు భయంగా మారిందని ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
బాలయ్య రూపం చూసి భయపడిపోతున్న బుడ్డోడు..
అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘అఖండ 2’ సినిమా నుండి టీజర్ ను నిన్న సాయంత్రం 6:03 గంటలకు మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది . ఇందులో బాలయ్య తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ఇక అంతానే బాగున్నా ఆయన లుక్కు మాత్రం చిన్నపిల్లలను భయపెడుతోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా బాలయ్య అఖండ 2 టీజర్ చూసిన తర్వాత.. ఒక అబ్బాయితో వాళ్ళ నాన్న బాలకృష్ణ అని పిలవగానే.. ఆ అబ్బాయి భయపడిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. చూడు ఒకవైపే చూడు అంటూ డైలాగ్ చెబుతుండగానే ఆ అబ్బాయి మరింత గట్టిగా ఏడవడం ఆ వీడియోలో చూడవచ్చు. ఇకపోతే ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంతా “ఒరేయ్ బుడ్డోడా.. అక్కడ ఉంది బూచోడు కాదు రా.. బాలయ్య తాతయ్యనే రా” అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే అఖండ 2 టీజర్ బయటకి వచ్చిన తర్వాత ఇలా వీడియోలతో పాటు పలు రకాల మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Also read: Raha Kapoor: అత్యంత ధనవంతురాలుగా స్టార్ కిడ్.. 2 ఏళ్లకే రూ.250 కోట్లకు అధిపతి.. ఎవరంటే?
అఖండ 2 సినిమా విశేషాలు..
బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా విషయానికొస్తే.. గతంలోనే బోయపాటి శ్రీను(Bouapati Srinu), బాలకృష్ణ కాంబినేషన్లో ‘అఖండ’ సినిమా వచ్చింది. ఈ సినిమా ఊహించిన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. బాలయ్య కెరియర్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కూడా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గా ‘అఖండ 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా సందర్భంగా విడుదల చేయబోతున్న ఈ సినిమాకి బోయపాటి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. సంయుక్త మీనన్(Samyuktha Menon), ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరి బాలయ్యకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Insta lo Dorikindhi 🤣🤣 pic.twitter.com/ipgGxOsXim
— Chiruholic (@chiruholicc) June 9, 2025