Film industry:సాధారణంగా సెలబ్రిటీలైనా..సామాన్య ప్రజలైనా.. ఎంత కష్టపడ్డా ..ఎంత సంపాదించినా.. చివరికి తమ పిల్లలకే ఆ ఆస్తులు అప్పజెప్పుతారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తమ కూతురు అలా పుట్టిందో లేదో అప్పుడే ఆ పాప పేరుపైన ఏకంగా వందల కోట్ల విలువ చేసే బంగ్లాను ఆమెకు బహుమతిగా ఇచ్చి.. రిచెస్ట్ కిడ్ గా మార్చేశారు ఈ జంట. ఇక వారెవరు..? తమ కూతురుకి ఇచ్చిన ఆస్తి ఎక్కడుంది? దాని విలువ ఎంత? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
కూతురికి ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇచ్చిన బాలీవుడ్ జంట..
సాధారణంగా సెలబ్రిటీలు తమ పిల్లల కోసం వేల కోట్ల రూపాయలను కూడబెడతారు.. కానీ అవన్నీ కూడా తమ తర్వాతనే వారికి వారసత్వంగా అందేలా చూస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు సొంతం చేసుకున్న ఆలియా భట్ (Alia Bhatt), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) మాత్రం తమ కూతురుకి అత్యంత ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇచ్చి.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యంత ధనవంతురాలు అయినా స్టార్ కిడ్ గా తమ కూతురికి ఓ హోదాని కల్పించారు. అసలు విషయంలోకి వెళ్తే.. రణబీర్ కపూర్ , ఆలియా భట్ లు గతంలో మొదలుపెట్టిన తమ ఇల్లు ఇప్పటికీ ఎట్టకేలకు పూర్తయింది. సుమారుగా మూడు సంవత్సరాలుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ముంబైలోని బాంద్రా సెంటర్లో ఈ కొత్త ఇంటిని వారు నిర్మించారు త్వరలోనే ఆ ఇంట్లోకి షిఫ్ట్ కూడా కానున్నారు.
బంగ్లా ఖరీదు ఎంతంటే?
ఇకపోతే ఈ బంగ్లా విలువ సుమారుగా రూ.250 కోట్లు. ఇప్పుడు ఈ బంగ్లాను తమ కూతురు రాహా (Raha )పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించారు ఈ జంట. ఇక ఈ ఆస్తికి సంరక్షకురాలుగా రణబీర్ కపూర్ తల్లి, నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అంత ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కూతురు, తల్లికి గిఫ్ట్ గా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇకపోతే రణబీర్ కి ఆ ఇంటితో అనుబంధం ఇప్పటిది కాదు.. ఆయనకు వారసత్వంగా లభించింది. రాజ్ కపూర్ ఇండస్ట్రీలో పీక్స్ ఉన్నప్పుడు దానిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషి కపూర్ కూడా అందులోనే ఉన్నారు. అలా వారసత్వంగా రణబీర్ కపూర్ కి ఈ ఆస్తి చేతికి వచ్చింది.. అయితే ఇప్పుడు దానిని రీ మోడలింగ్ చేయించారు. పాత కట్టడాలకు ఎలాంటి డామేజ్ జరగకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆరు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు నిర్మించార. మరో రెండు నెలల్లో గృహప్రవేశం కూడా చేయనున్నట్లు సమాచారం.
రిచెస్ట్ స్టార్ కిడ్గా రాహా.
ఇకపోతే రణబీర్ కి తన కూతురు రాహా పుట్టిన తర్వాత అటు కెరియర్ పరంగా కూడా బాగా కలిసి వచ్చింది. ఆయన నటించిన అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించాయి. ఈ క్రమంలోనే తన కూతురికి గిఫ్ట్ గా ఈ బంగ్లాను ఇచ్చేశారు ఈ జంట. ఇక ఈ విషయం తెలిసి బాలీవుడ్ మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇక వచ్చే దీపావళిని ఆ కొత్త ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలని ఈ జంట ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే రెండేళ్ల వయసులోనే రూ.250 కోట్లకు అధిపతి అయ్యి రిచెస్ట్ స్టార్ కిడ్ గా పేరు సొంతం చేసుకుంది రాహా.
ALSO READ:Nagarjuna: ఏఎన్ఆర్ ను వేడుకున్న నాగార్జున.. ఆ రహస్యం మా పిల్లలకైనా చెప్పండంటూ!