Intinti Ramayanam Today Episode june 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి ఇంటికి వెళ్ళగానే కమల్ హాల్లో కూర్చొని ఉండటంతో పల్లవికి వీడికి దొరికితే నన్ను చావు కొడతాడని పల్లవి సైలెంట్ గా సైడ్ అయిపోవాలని అనుకుంటుంది. వెనకలి నుంచి వెళ్లి గదిలోకి వెళ్లాలని పల్లవి అనుకుంటుంది. కానీ కమల్ మాత్రం పల్లవిని కనిపెట్టేస్తాడు.. ఎక్కడికి వెళ్లావు నువ్వు అని అడుగుతాడు. మా ఇంటికి వెళ్లానని పల్లవి సమాధానం చెబుతుంది. మీ నాన్న దగ్గరికి వెళ్లి పొద్దున ఏదో సంతకాల గురించి నువ్వు మీ నాన్న కుమ్మక్కయి చేశారు కదా.. ఇప్పుడు కూడా అలాంటి కొంపల గురించి పనులు ఏమైనా చేస్తున్నావా అని డైరెక్ట్ గా అడుగుతాడు.. కంపెనీకి మీ నాన్న నీ వల్ల ఏదైనా జరిగితే ఆ తర్వాత మీ ఇద్దరికీ ఉంటుంది చూడండి అని కమల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.. రాజేంద్రప్రసాద్ అవని మాటని కాదనలేక మౌనంగా ఉండిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనిని రాజేంద్రప్రసాద్ అరుస్తాడు. ఎందుకమ్మా నువ్వు ఇలా చేశావు. ఇప్పుడు ఏదైనా జరిగితే ఏంటి ఎవరు సమాధానం చెప్తారు అని అంటాడు.. మీరు ఇలా చేయకపోతే నన్ను ఖచ్చితంగా ఏదో అనుకుంటారు ఇప్పుడు నా మీద మరో నిందల్ని వేస్తారు అని అవని అంటుంది. అవని చెప్పిన సమాధానం విని రాజేంద్రప్రసాద్ మౌనంగా ఉంటాడు. ఉదయం లేవగానే అక్షయ్ ఆస్తులన్నీ జప్తు చేశారు అన్న విషయాన్ని కమల్ పేపర్ తీసుకొని వచ్చి చెప్తాడు.. ఆమాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కు గురవుతారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏమైంది అని అనగానే.. కమల్ ఆ పేపర్ చూపించి మీకు ఈ విషయం తెలియదా రాజేంద్రప్రసాద్ ఆస్తులు కంపెనీ వ్యవహారాలని కొలప్స్ అయిపోయాయి.
రాత్రికి రాత్రే ప్లేట్ తిప్పేసారంటూ టీవీలో కూడా వార్తలు వస్తున్నాయి చూడండి అంటూ అంటాడు. దానికి ఇంట్లోని వాళ్ళందరూ టీవీ చూసి షాక్ అవుతారు.. ఏంట్రా ఇలా అయింది ఈ విషయం వినగానే నాకు కాళ్లు చేతులు ఆడడం లేదు అని పార్వతి అంటుంది. అయితే పల్లవి మాత్రం నేను ఇన్నాళ్లు వెయిట్ చేసినా గుడ్ న్యూస్ ని ఈరోజు విన్నానని ఫుల్ ఖుషి అవుతూ ఉంటుంది. వెంటనే పల్లవి తన తండ్రి దగ్గరికి వెళ్తుంది.
ఇద్దరితో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఏంటమ్మా ఇలా వచ్చావని అడిగితే మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను నాన్న అని పల్లవి అంటుంది. ఇది సరే కానీ వీళ్లిద్దరు ఎవరు అని అడుగుతుంది. నా బినామీలు నా బిజినెస్ పార్ట్నర్స్ అని చక్రధరంటాడు. రాజేంద్రప్రసాద్ కంపెనీని పడగొట్టేందుకు ఏదో ప్లాన్ చేస్తానన్నావు. నాకు అంత టైం లేదనిపించింది నేనే వీళ్లిద్దరిని పెట్టి కంపెనీ ని కొలాప్స్ చేసేలా చేశానని అంటాడు..
మీరిద్దరు చేసింది చాలా గ్రేట్ పని అని పల్లవి కూడా మెచ్చుకుంటుంది.. అయితే అక్షయ్ డబ్బులని ఎక్కడికి పోనివ్వకుండా నా దగ్గరే పెట్టుకుని, బంగారు గుడ్లు పెట్టే బాతు లాగా ఆ డబ్బులు పదింతలు చేస్తానని చక్రధర అంటాడు. మాట వినగానే పల్లవి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. ఇక పల్లవి ఇంటికి వెళ్ళగానే అందరూ టెన్షన్ పడుతుండటం చూసి తనలో తానే నవ్వుకుంటూ సంతోషంగా ఫీల్ అవుతుంది.
అయితే అప్పుడే ఆ ఇంటికి కొందరు ఆఫీసర్లు వస్తారు. అటు అవని మీరు ఈరోజు పేపర్ చూడలేదా మావయ్య గారు అని ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ తో చెబుతుంది. ఆ మాట వినగానే రాజేంద్రప్రసాద్ 40 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వచ్చిన పరువు మర్యాదల్ని ఒక్క సంతకం తో పాటు తీసేసాడు అమ్మ అని బాధపడతాడు.. ఇప్పుడు మనం అక్కడికి వెళ్లకపోతే వాళ్ళు చాలా బాధపడుతుంటారు. వెళ్దాం పదండి మావయ్య అని రాజేంద్రప్రసాద్ ని అవినీతి తీసుకొని తన ఇంటికి బయలుదేరుతుంది. ఆఫీసర్లు ఇంట్లోకి వచ్చేస్తారు. అక్షయ్ మీరేంటి ఆఫీసర్స్ ఎలా వచ్చారు మీతో నేను ఆఫీస్ కొచ్చి మాట్లాడుతాను మీరు వెళ్ళండి అని అంటున్నా కూడా.. సారీ అక్షయ్ గారు కంపెనీ కోసం తీసుకున్న 85 కోట్లు మాకు తిరిగి చెల్లించాలి. మీరు ఇప్పటివరకు చెల్లించలేదు అంటే ఏంటిది మేము చెప్తే చేస్తున్నాం. మీరంతా వెంటనే ఖాళీ చేసి మీరు బయటకు వెళ్ళండి అంటూ షాక్ ఇస్తారు..
అప్పుడే అవని ఎక్స్క్యూజ్మీ ఆఫీసర్స్ అని అక్కడికి వస్తుంది. ఇంటి నమ్మి అధికారం ఎవరికీ లేదు అని చెప్తుంది. ఆ మాట విన్న పల్లవి షాక్ అవుతుంది.. ఆస్తులు గురించి అవని ఆఫీసర్స్ తో మాట్లాడుతుంది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ ఆస్తిలో సగం వాటాన్ని నా పెద్ద కోడలు పేరుమీద రాశాను ఇదిగోండి డాక్యుమెంట్స్ అని రాజేంద్రప్రసాద్ చెప్తాడు. దాంతో ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..