Kommineni: ఏపీ రాజకీయాలు ఓ రేంజ్‌లో హీటెక్కాయి. అమరావతి మహిళలను వేశ్యలతో పోల్చడంపై ఇరకాటంలో పడ్డారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు. అమరావతి మహిళలు ఫిర్యాదు మేరకు ఆయన్ని అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
వైసీపీ అధికారిక గెజిట్ ‘సాక్షి’తన బ్యానర్‌లో తాటి కాయంత అక్షరాలతో హెడ్ లైన్ వార్త రాసుకొచ్చింది.‘పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి’ అంటూ క్యాప్షన్‌తో రాసుకొచ్చింది. అందులో కొమ్మినేని అక్రమ అరెస్టుని ప్రధానంగా ప్రస్తావించింది. రాజకీయ విశ్లేకుడి అభిప్రాయాన్ని సాక్షి అభిప్రాయంగా ఆపాదించడం ఎంతవరకు కరెక్టు అని రాసుకొచ్చింది.
ఆయనపై ఎస్టీ, ఎస్సీ వేధింపుల సెక్షన్లు నమోదు చేశారని ప్రస్తావించింది. కొమ్మినేని, సాక్షి యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఇదే సమయంలో కొన్ని విషయాలు బయటపెట్టింది ఆ పత్రిక.
70 ఏళ్ల వయస్సులో కొమ్మినేని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, కనీసం ఇంటిలోపలకు వెళ్లి మందులను తెచ్చుకునేందుకు అనుమతించలేని తనదైన శైలిలో ప్రస్తావించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై రాయాల్సిన మాటలను రాసేసింది.
ALSO READ: అమరావతి వేశ్యల రాజధానా.. భారతిరెడ్డిపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ఇక్కడే కొమ్మినేని శ్రీనివాసరావు హార్డ్‌కోర్ అభిమానులు పాత వీడియోలను తెరపైకి తెచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు ‘సాక్షి’ ఛానెల్ డిబేట్‌లో కీలక విషయాలు ప్రస్తావించారు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు.
ఏపీలో విచిత్రమైన అపోజిషన్ ఉందన్న కొమ్మినేని, అలాంటిది ఎక్కడా ఉండదన్నారు. చంద్రబాబును ఈ వయస్సులో అరెస్టు చేస్తారా? అని కొందరు ప్రశ్నలపై తనదైనశైలిలో రిప్లై ఇచ్చారు. అరెస్టుకు వయసుతో సంబంధం లేదని క్లియర్‌గా ప్రస్తావించారు.
87 ఏళ్ల వయసులో ఓం ప్రకాశ్ చౌతాలా, 75 ఏళ్ల వయసులో లాలూ ప్రసాద్ యాదవ్, మధుకోడా, జయలలిత వంటి నేతలు అరెస్టు కాలేదా? అంటూ ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన వీడియోలను ట్రోలింగ్ చేస్తున్నారు టీడీపీ హార్డ్‌కోర్ అభిమానులు. కొమ్మినేని మాటలకు.. సాక్షి రాతలకు లింకు పెట్టి మరీ సోషల్‌మీడియాలో విపరీతంగా ఆటాడుకుంటున్నారు.
మరో విచిత్రం ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై ఆందోళనను చేపట్టాలని జర్నలిస్టుల అసోసియేషన్లపై ఒత్తిడి చేసిందట వైసీపీ. దీనికి ఓ ఒక్కరూ ముందుకు రావడానికి ఇష్టపడలేదు. మీ రాజకీయ క్రీడలో తాము పావులుగా మారిపోతున్నామని వాపోయారట. కొమ్మినేని విషయంలో మీరు.. మీరు చూసుకోవాలని, తమను బలిపశువులు చేయకుండా వదిలేయాలని వేడుకున్నాయట కొన్ని జర్నలిస్టుల సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు.
వయసుకి అరెస్ట్ కి ఎం సంబంధం అని అప్పట్లో మన కొమ్మినేని వారి ప్రవచనాలు ఇలా ఉండేవి pic.twitter.com/aEzQEvOzEV
— Srivalli (@srivalli2000) June 9, 2025