E-Paper
Advertisement

Weather News: రాష్ట్రంలో భారీ పిడుగుల వర్షం.. ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండండి.. బయటకు వెళ్తే మాత్రం

Weather News: రాష్ట్రంలో భారీ పిడుగుల వర్షం.. ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండండి.. బయటకు వెళ్తే మాత్రం
Advertisement

Weather News: ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే వచ్చాయి. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రైతులు కూడా వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయిపోయారు. పలు జిల్లాల్లో ఇప్పటికే పత్తిగింజలు పెట్టడం పూర్తి చేశారు. కొందరు నార్లు కూడా పోశారు. మరి కొంత మంది రైతులు పొలాలను ఇప్పుడే చదును చేస్తున్నారు. పంటపొలాల్లో రైతు నేస్తాలు ఆరుద్ర పురుగులు దర్శనం ఇస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రైతులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 11 వరకు వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడా పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్రంలో 36 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

ALSO READ:  వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించడం తప్పనిసరి

రానున్న నాలుగు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. అయితే ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు.  ఇక హైదరాబాద్ రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భాగ్యనగరంలో వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలో గత వారం రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. సేమ్ టైం.. పగటి వేళ ఎండలు కూడా దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు బీభత్సం సృష్టించడంతో.. కొంతమంది చనిపోయారు. అయితే రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

Advertisement

ALSO READ: IMD Alert: మళ్లీ మబ్బులు, చినుకులు.. హైదరాబాద్ కు భారీ వర్షసూచన!

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×