E-Paper
Advertisement

Vijay : ఇన్ స్టాలో విజయ్ ఎంట్రీ.. రికార్డులు బ్రేక్..

Vijay : ఇన్ స్టాలో విజయ్ ఎంట్రీ.. రికార్డులు బ్రేక్..

Vijay : విజయ్.. ఆ పేరు చెబితే తమిళనాడులో ఫ్యాన్స్ ఊగిపోతారు. ఇక ఈ హీరో సినిమా విడుదలరోజు ఆ రాష్ట్రంలో పండగ వాతావరణమే నెలకొంటుంది. అభిమానులతో థియేటర్లు కిక్కిరిసిపోతాయి. మాస్ లో విపరీతమైన ఆదరణ ఉన్న కథానాయకుడిగా విజయ్ కు పేరుంది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఈ హీరో సినిమాలు కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయి. ఇలా ఎన్నో సినిమాలు నిరూపించాయి. కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లో విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు.

కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తరికార్డు సృష్టించాడు. తాజాగా ఈ మాస్ హీరో ఇన్ స్టా గ్రామ్ ఖాతా తెరిచాడు. ఇన్ స్టాగ్రామ్ లో చేరిన కొద్ది గంటల్లోనే 10 లక్షల మందిని విజయన్ ను ఫాలో అయ్యారు. అంటే ఈ హీరో రేంజ్ అది మరి.

“హల్లో ఫ్రెండ్స్ నేను విజయ్ ను. రష్మిక మందన్నా తో కలిసి నటించిన వారీసు ( వారసుడు) చిత్రంలో చివరిసారిగా చూశారు”. అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ ఫోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా షేక్ అయ్యింది. అభిమానులు విజయ్ పోస్ట్ కు లైకులు కొడుతూ ఫాలో అయ్యారు. తమ అభిమాన హీరోకి వెల్ కమ్ చెబుతూ కామెంట్లు పెట్టారు. ఈ పోస్ట్ పెట్టిన రెండు గంటల్లోనే 10 లక్షల మంది విజయ్ ను ఫాలో అయ్యారు. ఇది సరికొత్త రికార్డు.

ఇన్ స్టాలో విజయ్ ను రష్మిక మందన్నా, కీర్తి సురేష్, ప్రియాంక మోహన్, ఐశ్వర్య రాజేశ్, థమన్ ఫాలో అవుతున్నారు. విజయ్ మాత్రం ఎవ్వరినీ ఫాలో చేయడం లేదు. అయితే ఫస్ట్ పోస్ట్ పెట్టడంతో 11 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.విజయ్ గతంలోనే ట్విటర్ ఖాత్ ఓపెన్ చేశారు. 4.4 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×