Niharika Konidela about Marriage(Today tollywood news): నిహారిక కొణిదెల అంటే పరిచయం అక్కర్లేని పేరు. మెగా డాటర్ గానే ఎంట్రీ ఇచ్చినా..తనకంటూ సొంత ట్యాలెంట్ తో నెగ్గుకొస్తోంది. టీవీ యాంకర్ గా, నటిగా, నిర్మాతగా అన్ని రంగాలలోనూ సక్సెస్ ను చవిచూసింది. ముందుగా ఈ టీవీలో వచ్చిన ఢీ జూనియర్ షోకి హోస్ట్ గా వ్యవహరించింది. తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ను ప్రారంభించింది. ఆ బ్యానర్ లో వెబ్ సిరీస్ నిర్మించింది. అందులో తానే హీరోయిన్ గా నటించింది. వెరైటీ టైటిల్ తో వచ్చిన ‘ముద్ద పప్పు ఆవకాయ్’ అనే అచ్చ తెలుగు టైటిల్ తో తన ట్యాలెంట్ ఏమిటో ప్రూవ్ చేసుకుంది. అయితే ఈ సిరీస్ యూట్యూబ్ లో విడుదలై మంచి సక్సెస్ సాధించింది.
నిర్మాతగా తొలి ప్రయత్నమే సక్సెస్
2015లో ఒక మనసు చిత్రంలో కథానాయికగా నటించింది. నాగశౌర్య అందులో హీరోగా నటించాడు. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలలో నటించి మంచి నటిగా ప్రశంసలు అందుకుంది. చిరంజీవి నటించిన సైరాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. కొంత కాలం నటనకు దూరంగా ఉన్న నిహారిక తొలిసారి నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్లు మూవీతో మళ్లీ ముందుకొచ్చింది. ఇక ఈ మూవీ మంచి మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. అంతా కొత్త కుర్రోళ్లతో నిర్మించిన నిహారిక గట్స్ చూసి అందరూ అభినందిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై తమ అభిప్రాయాలను తెలుపుతూ.. నిహారికను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల మహేష్ బాబు కూడా కమిటీ కుర్రోళ్లు మూవీ సక్సెస్ పై ప్రత్యేకంగా నిహారికను అభినందించారు.
రెండేళ్లకే విడాకులు
ఇక నిహారిక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ..2020లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమెకు వివాహం జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. అయితే వివాహమైన రెండేళ్లకే ఇద్దరూ వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. 2023లో నిహారిక, చైతన్యలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఏడాది తర్వాత నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్లు మూవీని తీసి సక్సెస్ అయ్యారు. కేవలం మూడు రోజుల్లో రూ.3 కోట్లు వసూలు చేసి కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది.
పెళ్లిచేసుకుంటే తప్పేంటి?
గత కొంతకాలంగా నిహారిక పెళ్లి వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. నిహారిక కూడా తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటూ ఈ మధ్య ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని చెబుతూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. లవ్ అనేది ఎప్పుడు ఎందుకు పుడుతుందో తెలియదు. అందుకే తన మనసుకు నచ్చి, తన ఆదర్శాలను గౌరవించే వ్యక్తి ఎదురుపడితే తప్పక పెళ్లి చేసుకుంటానని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చింది. అలాంటి సందర్భమే కనుక వస్తే రెండో పెళ్లి చేసుకుంటాను.. అందులో తప్పేముంది అన్నారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ను ప్రేక్షకులు మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. ఈమెను పెళ్లాడబోయే ఆ కమిట్ మెంట్ ఉన్న కుర్రోడు ఎవరో అని కామెంట్స్ పెడుతున్నారు.