Léon Marchand in Paris Olympics(Sports news headlines): నాలుగు సంవత్సరాలకోసారి వచ్చే ఒలింపిక్స్ క్రీడల కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. అన్ని దేశాల నుంచి వచ్చే ఆటగాళ్లు దేశం కోసం పతకాలు సాధించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. కానీ అతి కొద్ది మంది మెడల్స్ సాధించే స్థాయి ఆటతీరు కనబరుస్తారు. భారతదేశంలో అయితే.. కాంస్య పతకం సాధిస్తే చాలు వాళ్లను హీరోలలా మీడియా ఆకాశానికెత్తేస్తుంది. కానీ ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొత్తం ఆరు మెడల్స్ వచ్చాయి. వీటిలో ఒక్క బంగారు పతకం కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో ఒకే ఆటగాడు అయిదు పతకాలు సాధించాడు. అందులో నాలుగు బంగారు పతాకాలు, ఒక కాంస్య పతకం. అతనే లియోన్ మర్చండ్.
లియోన్ మర్చండ్ ఇప్పుడు ఒక స్విమ్మింగ్ సెన్సేషన్. కేవలం 21 ఏళ్ల వయసులో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించడమంటే సాధారణ విషయం కాదు. ఫ్రాన్స్ దేశానికి చెందిన లియోన్ గెలిచిన నాలుగు బంగారు పతకాలు కూడా సింగిల్స్ స్విమ్మింగ్ పోటీల్లోనే కావడం గమనార్హం. 400 మీటర్ల ఇండివిడువల్ మెడ్లే, 200 మీటర్ల ఇండివిడువల్ మెడ్లే, 200 మీటర్ల బటర్ ఫ్లై, 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్.. ఈత పోటీల్లో లియోన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ నాలుగు మెడల్స్ తో పాటు 4*100 మీటర్ల మెడ్లే రిలే పోటీల్లో లియోన్ తన ముగ్గురు సభ్యుల టీమ్ తో కలిసి కాంస్య పతకం కూడా సాధించాడు. పతాకల జాబితాలో మొత్తం 16 మెడల్స్‌తో ఫ్రాన్స్ దేశం అయిదో స్థానంలో ఉంది.
Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో
ఈ పతకాల జాబితాలో 184 దేశాలు.. 5 మెడల్స్ కంటే తక్కువ ఉన్నాయి. అంటే 184 దేశాల కంటే లియోన్ వద్ద ఎక్కువ పారిస్ ఒలింపిక్స్ మెడల్స్ ఉన్నాయి. అదే బంగారు పతకాల విషయానికొస్తే.. లియోన్ వద్ద మన దేశం కంటే ఎక్కువ పతకాలున్నాయి. పారిస్ ఒలింపిక్స్ పతకాల జాబితాలో కింది స్థానం నుంచి లెక్క చూస్తే.. నాలుగు బంగారు పతకాలు గెలిచిన దేశాల్లో స్విడెన్ , కెన్యా, నార్వే, ఐర్ ల్యాండ్ దేశాలు మాత్రమే ఉన్నాయి.
ఇక్కడ లియోన్ మర్చండ్ ఇన్ని పతకాలు సాధించడానికి ఒక రహస్యం ఉంది. అదే అమెరికా స్విమ్మింగ్ లెజెండ్ మైకేల్ ఫెల్ప్స్ తో ఉన్న కనెక్షన్. మైకెల్ ఫెల్ఫ్స్ స్విమ్మింగ్ రికార్డులు ఇంతవరకూ ప్రపంచంలో ఎవరూ బ్రేక్ చేయలేదు. అయితే మైకెల్ ఫెల్ఫ్స్ కు శిక్షణ ఇచ్చిన బాబ్ బౌమ్యాన్.. లియోన్ మర్చండ్ కు కూడా శిక్షణ ఇవ్వడం గమనార్హం.