CM Revanth Reddy news today(Political news in telangana): అమెరికాలో టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పం దాలను తప్పుబట్టారు బీఆర్ఎస్ నేతలు. అవన్నీ ఫేక్ అంటూ సోషల్‌మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఆ ఆరోపణలకు కౌంటరిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. తాను మాటల మనిషిని కాదని, చేసి చూపించే వ్యక్తినంటూ ప్రత్యర్థులకు సంకేతాలు పంపారు. ఒప్పందం కుదిరిన తొమ్మిది రోజులకే ఐటీ దిగ్గజ సంస్త కాగ్నిజెంట్ బుధవారం కొత్త క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో షాకవ్వడం బీఆర్ఎస్ నేతల వంతైంది.
ఆగష్టు రెండున అమెరికా పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి. ఐదున ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తో ఒప్పందం కుదుర్చుకుంది రేవంత్ సర్కార్. 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నిర్మాణంతోపాటు 15వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆ ఒప్పందం. ఇందులోభాగంగా బుధవారం ఆ కంపెనీ కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.
కోకాపేటలోని జీఏఆర్ బిల్డింగ్ వద్ద కొత్త క్యాంపస్ శంకుస్థాపన జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం భూమి పూజ చేయనున్నారు. వీలైనంత వేగంగా క్యాంపస్‌ని నిర్మించాలన్నది ఆ కంపెనీ ఆలోచన. చెన్నై కేంద్రంగా 30 ఏళ్ల కిందట ఆవిర్భవించిన కాగ్నిజెంట్, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ కంపెనీకి చెందిన ఐదు క్యాంపస్‌ల్లో దాదాపు 57 వేల మంది ఉద్యోగులున్నారు. తెలంగాణ ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు అందిస్తున్న రెండో కంపెనీ కాగ్నిజెంట్.
ALSO READ: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం.. నేటితో సమాప్తం
గడిచిన రెండేళ్లలో 34 విద్యాసంస్థల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న 7500 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక ఏడాది తెలంగాణ నుంచి 7 వేల కోట్లకు పైగానే ఐటీ ఎగుమతులు చేసింది. అంతే కాదు సామాజిక బాధ్యత కిందట దాదాపు 22 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపడుతోంది కూడా. అయితే కొత్త క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌తోపాటు అడ్వాన్స్ టెక్నాలజీపై దృష్టి పెట్ట నున్నట్లు తెలుస్తోంది.