Ram Charan Vs Nani..సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోల మధ్య పోటీ నెలకొనడం అత్యంత సహజం. ఒకే రోజున పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం లేదా ఒకటి రెండు రోజుల తేడాతో రిలీజ్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి కారణాల వల్ల ఆ హీరోల అభిమానుల మధ్య వాతావరణం వేడి పుట్టిస్తుంది. అయితే ఒకేరోజు ఇద్దరు హీరోలు కాదు ఏకంగా నలుగురు హీరోల సినిమాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) మూవీకి పోటీగా బరిలోకి దిగుతున్నారు నేచురల్ స్టార్ నాని(Nani ) ఎప్పుడూ విభిన్నమైన పాత్రలతో మినిమం గ్యారంటీ అనే నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు నాచురల్ స్టార్ నాని. ఇక ఈమధ్య కాలంలో ఎక్కువగా రియాల్టీకి దగ్గరగా ఉండే సినిమాలు చేస్తూ.. నిర్మిస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
నాని వర్సెస్ రామ్ చరణ్..
ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odala) దర్శకత్వంలో నాని ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ కానుంది. 2026 మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇటీవల గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా..ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో నాని చాలా మాస్ పర్ఫార్మన్స్ తో ఆశ్చర్యపరిచారు. అయితే ఇదిలా ఉండగా.. ఇదే సమయంలో సక్సెస్ కోసం ఎదురుచూస్తూ.. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చి బాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుండగా.. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను వచ్చే యేడాది మార్చి 27వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసింది.
ఆందోళనలో అభిమానులు..
దీన్ని బట్టి చూస్తే నాని ప్యారడైజ్ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే రామ్ చరణ్ పెద్ది సినిమా విడుదల కాబోతోంది. ఇక దీంతో రాంచరణ్ మూవీకి నాని ప్యారడైజ్ మూవీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాని సినిమాలు అంటేనే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఉంది. అటు రామ్ చరణ్ సినిమా హిట్ అయితేనే కోట వర్షం కురుస్తుంది. లేకపోతే ఈ ఏడాది మొదట్లో విడుదలైన గేమ్ ఛేంజర్ లాగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే నాని సినిమా వస్తోందని తెలిసి కూడా పెద్ది సినిమాను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి తోడు ఆరోజు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో సినిమా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ముందడుగు వేసినట్లు సమాచారం. మరి ఈ రెండు సినిమాలలో అభిమానులు ఏ హీరోని ఆదరిస్తారో చూడాలి. పైగా కంటెంట్ బాగుంటే ఇద్దరికీ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పైగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో భారీ విజయం అందుకున్నారు. అటు బుచ్చిబాబు సనా కూడా ఉప్పెన సినిమాతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మరి ఇలాంటి ఇద్దరూ యంగ్ డైరెక్టర్స్ పోటీ పడబోతున్న నేపథ్యంలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందో చూడాలి.