Panjagutta Murder : మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని పంజాగుట్టలో అపహరణకు గురైన ఓ వ్యాపారి శవమై తేలాడు. ఈ ఘటన పంజాగుట్టలో కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28వ తేదీన పంజాగుట్టకు చెందిన ఓ వ్యాపారి కిడ్నాప్ కు కనిపించకుండాపోయాడు. అప్పటి నుంచి అతని కుటుంబ సభ్యులు, పోలీసులు ప్రయత్నిస్తున్నా.. ఆచూకీ లభించలేదు. కాగా.. మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు.
పంజాగుట్టకు చెందిన విష్ణురూపాని అనే వ్యాపారి కనిపించకుండాపోయినప్పడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అనేక మార్గాల్లో విష్ణురూపాని గురించి ఆరా తీస్తుండగా.. ఎస్‌ఆర్ నగర్‌లోని బుద్ధనగర్‌లోని ఓ గది నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదు అందింది. దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తెరచి చూడగా ఓ వ్యక్తి చనిపోయి కనిపించాడు. కాగా అతను పంజాగుట్టలో అదృశ్యమైన విష్ణురూపానిగా పోలీసులు తేల్చారు.
మృతదేహం పడి ఉన్న గదికి బయటి నుంచి తాళం వేసి ఉంది. దీంతో.. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. హత్యకు దారి తీసిన కారణాల్ని పోలీసుల అన్వేషిస్తున్నారు. కారు ఫైనాన్స్ కి సంబంధించిన వ్యవహారమే హత్యకు కారణంగా అనుమానిస్తుండగా.. త్వరలోనే నిందితుల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించా