Nidhhi Agerwal : టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి కొద్ది కాలంలోనే ఈ బ్యూటీకి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది. అయితే కెరీర్ లో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమాలపైనే ఉన్నాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న నిధి అగర్వాల్ తన కెరీర్ మొదట్లో ఎదురైన ఓ వింత అనుభవాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. అందులో ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు హీరోతో డేటింగ్ చేయకూడదని కండిషన్ పెట్టారని గుర్తు చేసుకుంది.
హీరోతో డేటింగ్ చేయకూడదని అగ్రిమెంట్
సినిమా ఇండస్ట్రీలో నిధి అగర్వాల్ ప్రయాణం ‘మున్నా మైఖేల్’ అనే సినిమాతో మొదలైంది. ఈ సినిమా టైమ్ లోనే నిర్మాతలు హీరోతో డేటింగ్ చేయకూడదనే కండిషన్ పెట్టినట్టు చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. ఆమె మాట్లాడుతూ “మున్నా మైకేల్ మూవీ చేస్తున్నప్పుడు చిత్ర బృందం నాతో ఒక కాంట్రాక్ట్ పై సైన్ చేయించుకుంది. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించాడు. అంతా ఓకే అనుకున్న తర్వాత ఈ సినిమాకు సంబంధించి నేను ఎలాంటి రూల్స్ పాటించాలి అనే విషయాన్ని కాంట్రాక్ట్ లో పొందుపరిచారు.
అయితే అందులో నో డేటింగ్ అనే కండిషన్ కూడా ఉంది. సినిమా కంప్లీట్ అయ్యేదాకా నేను హీరోతో డేట్ చేయకూడదు అన్నది ఆ రూల్ సారాంశం. నిజానికి కాంట్రాక్ట్ పై సైన్ చేసినప్పుడు నేను ఇవన్నీ అంతగా చదవలేదు. తర్వాత ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. అయితే సినిమా చేస్తున్నప్పుడు ప్రేమలో పడితే నటినటులు పనిపై దృష్టి పెట్టరని ఉద్దేశంతో ఆ టీం ఇలాంటి కండిషన్ పెట్టిందని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
అసభ్యకర కామెంట్స్ పై నిధి రియాక్షన్
ఇక ఇదే సందర్భంగా ట్రోలింగ్ గురించి మాట్లాడింది నిధి అగర్వాల్. “మంచైనా, చెడైనా చెప్పడానికి ఓ విధానం అంటుంది. అయితే హద్దు దాటి అసభ్యకర పదాలు ఉపయోగిస్తూ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిని నేనైతే అస్సలు పట్టించుకోను. అందుకే సోషల్ మీడియాలో చేసే నెగెటివ్ కామెంట్స్ నాపై పెద్దగా ఎఫెక్ట్ చూపించలేవు. కానీ కొంతమంది ఇలాంటి దారుణమైన కామెంట్స్ చూసి బాధపడతారు. కాబట్టి ఎవరి పైన అయినా కామెంట్ చేయాలనుకుంటే మర్యాదపూర్వకంగా చేస్తే మంచిది” అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పేరుతో హీరో హీరోయిన్ల పై అసభ్యకర కామెంట్స్ చేసే వారికి సలహా ఇచ్చింది నీది అగర్వాల్.
ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిధి అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఫస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ మే 9న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న ఈ మూవీ ఎట్టకేలకు సమ్మర్ కానుకగా రాబోతోంది.