BigTV English

Pooja Hegde : సెట్లో హీరోయిన్ల పరిస్థితి ఇంత దారుణమా? ఇండస్ట్రీ గురించి తెలియని నిజాలు బయటపెట్టిన పూజా హెగ్డే

Pooja Hegde : సెట్లో హీరోయిన్ల పరిస్థితి ఇంత దారుణమా? ఇండస్ట్రీ గురించి తెలియని నిజాలు బయటపెట్టిన పూజా హెగ్డే

Pooja Hegde : ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటాయన్న విషయాన్ని చాలా సార్లు విన్నాం మనం. మరోవైపు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అనే వాదన కూడా ఉంది. ఇక ఎవరెలా ఉన్నా హీరో హీరోయిన్లకు మాత్రం సెట్లో మంచి రెస్పెక్ట్ తో పాటు, తమకు నచ్చిన విధంగా ఉండే వెసులుబాటును నిర్మాతలు కల్పిస్తారని అందరూ అనుకుంటారు. కానీ తాజాగా పూజా హెగ్డే (Pooja Hegde) అలాంటిదేమీ ఉండదు అంటూ బాంబ్ పేల్చింది.


సెట్లో ఇంతటి వివక్షా?

పూజా హెగ్డే తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. కొన్నాళ్ళ క్రితం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ మధ్యలో అవకాశాలు లేక సతమతం అయ్యింది. రీసెంట్ గా ఒకటి రెండు బిగ్ ప్రాజెక్ట్స్ చేతిలో పడడంతో వాటిని వాడుకొని, పుంజుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే గతంలోలా కాకుండా స్క్రిప్ట్ ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.


ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా సెట్ లో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో “కోస్టార్స్ కారణంగా ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించిందా?” అనే ప్రశ్నకి పూజ హెగ్డే ఊహించని సమాధానాన్ని చెప్పింది. ఆమె మాట్లాడుతూ “అన్ని చిత్రపరిశ్రమలో ఆల్మోస్ట్ ఇదే సిచువేషన్ ఉంటుంది. కానీ పరిశ్రమకు తగ్గట్టుగా ఒక్కోచోట ఒక్కోలా పరిస్థితి మారుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సినిమా షూటింగ్ జరిగే సెట్ కు పక్కనే హీరో వ్యానిటీని ఆపుతారు. మిగిలిన వాళ్లకు మాత్రం దూరంగా ఉంటాయి.

ఇక మేమైతే అంత దూరం నుంచి బరువైన కాస్ట్యూమ్స్, భారీ లెహంగాలు ధరించే సెట్ వరకు నడుచుకుంటూ వెళ్లి, షూటింగ్ పూర్తయ్యాక మళ్లీ అదే బరువైన దుస్తులను ఈడ్చుకుంటూ కేరవాన్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల కి మధ్య వివక్ష ఉంటుంది. మరికొన్నిసార్లు పోస్టర్లో పేరు కూడా ఉండదు, ఇంకొన్నిసార్లు లవ్ స్టోరీ లో నటించినప్పటికీ గుర్తింపు దక్కదు. సినిమా అనేది దానికోసం ప్రతి పని చేసేయ్ ప్రతి ఒక్కరి కష్టమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి” అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

హీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్ 

ఇక మరోవైపు కొంతమంది హీరోయిన్లు హీరోలకు హీరోయిన్లకు సేమ్ రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా స్పందిస్తూ హీరోయిన్లు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటే తాను హ్యాపీగా ఫీల్ అవుతానని వెల్లడించింది. కాగా గత ఏడాది ఒక్క సినిమాలో కూడా నటించలేకపోయిన పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టింది. షాహిద్ కపూర్ తో ‘దేవా’ అనే సినిమాతో ఈ ఏడాది మొదట్లోనే ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆమె ‘రెట్రో’ (Retro) సినిమాలో సూర్యతో రొమాన్స్ చేస్తోంది. అలాగే ‘జననాయగన్’ (Jananayagan), ‘కాంచన 4’ (Kanchana 4) లాంటి సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×