యూట్యూబర్ అన్వేష్. అలియాస్ ప్రపంచ యాత్రికుడు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అందరి లాగే ఓ చిన్న యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి, 5 ఏండ్లలో తెలుగులో టాప్ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైజాగ్ కు చెందిన ఈ కుర్రాడు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ, ఏకంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. యూనిక్ కంటెంట్ తో వీడియోలు క్రియేట్ చేస్తూ, కళ్లు చెదిరే ఆదాయాన్ని పొందుతున్నాడు. అదే సమయంలో అడ్డగోలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, ఎంతో మంది యువకుల ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్న సోకాల్డ్ ఇన్ ప్లూయెన్సర్ల బట్టలను ఊడదీసి నడి బజారులో నిలబెడుతూ హాట్ టాపిక్ గా మారాడు.
ఎవరీ అన్వేష్? ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలయ్యింది?
ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా భీమిలి. చిన్నప్పటి నుంచి ఆయనకు ఊర్లమీద పడి తిరగడం అంటే ఎంతో ఇష్టం. తన చదువు కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతో ట్రావెలింగ్ అండ్ టూరిజం కోర్సు తీసుకున్నాడు. అందులో పీజీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టాలి అనుకున్నాడు. కొద్ది రోజుల పాటు అప్పటికే పాపులర్ అయిన యూట్యూబ్ ఛానెల్స్ ను స్టడీ చేశాడు. 2019లో ‘నా అన్వేషణ’ అనే ఛానెల్ కు శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచి ప్రపంచం మీద పడ్డాడు. 6 ఏండ్ల క్రితం మొదలైన ఈ ప్రపంచ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఏకంగా 137కు పైగా దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ఆయా దేశాల్లోని వింతలు, విశేషాలు తను మాత్రమే చూడ్డం కాదు, అందరికీ చూపిస్తున్నాడు కూడా.
మిలియన్ల కొద్దీ సబ్ స్క్రైబర్ల
ప్రస్తుతం అన్వేష్ రెండు యూట్యూబ్ ఛానెల్స్ ను రన్ చేస్తున్నాడు. వీటిలో ఒకదానికి (నా అన్వేషణ) 2.37 మిలియన్ల వ్యూస్, మరో ఛానెల్ (ప్రపంచ యాత్రికుడు)కు 1.95 మిలియన్ల సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. అన్వేష్ షేర్ చేసే వీడియోలన కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంటే, ఆయన వీడియోలను ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అన్వేష్ దశ తిరిగించి ఆ వీడియో తోనే!
అన్వేష్ ను యూట్యూబర్ గా నిలబెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడిన వీడియో కిలిమంజారో పర్వాతారోణ వీడియో. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వాతాన్ని అన్వేష్ విజయవంతంగా అధిరోహించాడు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఏకంగా సుమారు 6 వేల మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత భారతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించాడు. ఈ వీడియోకు అనూహ్య రీతిలో వ్యూస్ రావడంతో ఓ రేంజిలో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా, చైనా సహా ఎన్నో దేశాల్లో తిరుగుతూ తన ప్రపంచ యాత్రను కొనసాగిస్తున్నాడు. ప్రపంచంలోని అన్ని దేశాలను తిరగాలన్నదే తన కోరిక అంటాడు అన్వేష్. ఇప్పుడు యూట్యూబ్ లో ఓ రేంజ్ లో దూకుడు కొనసాగిస్తున్నాడు.
కళ్లు చెదిరే ఆదాయం!
ఇక ప్రపంచంలోని వింతలు విశేషాలు చూపించే అన్వేష్.. యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయాన్ని పొందుతున్నాడు. తన వీడియోల ద్వారా నెలకు రూ. 50 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. ఎన్నో పాపులర్ చానెల్స్ కూడా సంపాదించనంత ఆదాయాన్ని, అన్వేష్ హ్యాపీగా, జాలీగా దేశాలు తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ భూమ్మీద ఉన్న అన్ని దేశాలు తిరగాలన్నదే తన లక్ష్యం అంటాడు ఈ ఆంధ్రా కుర్రాడు.
ఆలగాడిగా ఓ రేంజ్ లో గుర్తింపు
ఇక అన్వేష్ అనగానే ‘ఆటగాడు’ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. మనోడు ఏ దేశం వెళ్లినా, అక్కడి అమ్మాయిలతో ఆటలు ఆడటంలో ముందుంటాడు. ఆటలంటే.. బెట్టింగ్ యాప్స్ లో ఆటలు ఆడటం కాదు, ‘ఆ’ ఆటలు. అందుకే, అన్వేషన్ ను మాంచి ఆటగాడు అంటుంటారు నెలిజన్లు. ఇక ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఆయన.. ఎంతో మంది ఇన్ ఫ్లూయెన్సర్లకు టార్గెట్ అయ్యాడు. అదే సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ లాంటి వ్యక్తులు బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా అన్వేష్ చేస్తున్న పోరాటాన్ని ప్రశంసిస్తున్నారు. మొత్తంగా అన్వేషన్, యూట్యూబ్ వీడియోలతోనే కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి సింహ స్వప్నంగా మారారు. మరికొద్ది సంవత్సరాల్లోనే ఆయన అన్ని దేశాలను తిరగాలని ఆకాంక్షిస్తూ. ఆల్ ది బెస్ట్ అన్వేష్.
Read Also: పాపం వధువు, పెళ్లిలో ఒళ్లు కాలిపోయి.. ఆ ఎక్స్‌ట్రాలే కొంప ముంచాయ్!