E-Paper
Advertisement

Nidhhi Agerwal: ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్స్ ప్రారంభించిన నిధి.. మరి మిగతావారి పరిస్థితి.?

Nidhhi Agerwal: ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్స్ ప్రారంభించిన నిధి.. మరి మిగతావారి పరిస్థితి.?
Advertisement

Nidhhi Agerwal : చాలాకాలం క్రితం ప్రారంభమయిన సినిమా. ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదు. విడుదల తేదీ విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ప్రమోషన్స్ పెద్దగా మొదలు కాలేదు. ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ సినిమా మరేదో కాదు… పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్స్ మారుతూనే ఉన్నాయి. షూటింగ్ కూడా ఇంకా పూర్తయ్యిందా లేదా అనే క్లారిటీ లేదు. అలాంటిది హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం ఒంటరిగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా రంగంలోకి దిగింది.

దర్శకుడు తప్పుకున్నాడు

Advertisement

పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే ‘హరి హర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అయిపోయింది. పవన్ ఈ మూవీని సైన్ చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు బ్రేక్ లేకుండా షూటింగ్స్‌లో పాల్గొన్నాడు. అలా కొంతవరకు షూటింగ్‌ను పూర్తిచేశాడు. కానీ ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. అప్పటివరకు సైన్ చేసిన సినిమాలను పక్కన పెట్టేశాడు. అందులో ‘హరి హర వీరమల్లు’ కూడా ఒకటి. దీంతో దర్శకుడిగా క్రిష్ ఈ మూవీ నుండి తప్పుకున్నాడు. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించాడు.

ప్రమోషన్స్ బాధ్యత

Advertisement

రాజకీయాల్లో బిజీ అయిపోయి… ఎన్నికల్లో పాల్గొని గెలిచి డిప్యూటీ సీఎం కూడా అవ్వడంతో తన సినిమాలను టైమ్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) కు అస్సలు కుదరలేదు. అయినా కూడా కొన్నిరోజుల పాటు ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొనడానికి ముందుకొచ్చాడు. ఆయన ఇచ్చిన కాల్ షీట్స్ ప్రకారం ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేయాలనుకున్నా అదీ కుదరలేదు. దీంతో మార్చి 28న విడుదల కావాల్సిన సినిమా.. మే 9కు వాయిదా పడింది. మార్చిలో విడుదల అన్నప్పుడు కూడా మూవీ టీమ్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కానీ మేలో విడుదల పడిన వెంటనే హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ప్రమోషన్స్ బాధ్యతను తీసుకుంది. రీల్ ఛాలెంజ్‌తో మూవీ ప్రమోషన్ మొదలుపెట్టింది.

Also Read: అదే పట్టుదల.. అదే పౌరుషం.. ఎన్‌టీఆర్ మనవళ్లపై లేడీ అమితాబ్ కామెంట్.!

రీల్ ఛాలెంజ్

ఇటీవల ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నుండి ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ రెండో పాట విడుదలయ్యింది. ఆ పాటలో అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ.. పవన్ కళ్యాణ్‌తో కలిసి స్టెప్పులేశారు. నిధి అగర్వాల్ కూడా మధ్యలో స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆ పాటపై స్పెషల్‌గా రీల్ చేసి షేర్ చేసింది నిధి. ‘హరి హర వీరమల్లులో కొల్లగొట్టినాదిరో హుక్ స్టెప్ చేయడం చాలా నచ్చింది. ఇప్పుడు మీ టర్న్. ఈ రీల్ ఛాలెంజ్‌ను తీసుకొని మీ డ్యాన్స్ మాకు చూపించండి’ అంటూ నెటిజన్లను రీల్ ఛాలెంజ్ విసిరింది నిధి అగర్వాల్. ఇది చూసిన ప్రేక్షకులు కనీసం నిధి అయినా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×