Nidhi Aggarwal: నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) పరిచయం అవసరం లేని పేరు. సవ్యసాచి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఉత్తమ తొలి కథనాయకగా ఈ సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. ఇక ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిధి అగర్వాల్ అనంతరం మిస్టర్ మజ్ను, హీరో, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేసారు. ఇక ఈమె త్వరలోనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఈమె కీలక పాత్రలో నటించారు.
వింటేజ్ లుక్ లో ప్రభాస్…
ఇకపోతే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab)సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించడం అంటే పాన్ ఇండియా స్థాయిలో వీరికి కూడా అదే స్థాయిలో మంచి క్రేజ్ లభించడమే అని చెప్పాలి. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో నేడు టీజర్ విడుదల చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందో స్పష్టంగా చూపించారు అలాగే ప్రభాస్ వింటేజ్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
డబ్బింగ్ చెప్పిన నిధి..
ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా ప్రభాస్ సినిమా కోసం నిధి అగర్వాల్ ఇప్పటివరకు చేయని పని చేసినట్టు ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పటివరకు నిధి అగర్వాల్ నటించిన సినిమాలకు ఇతరులు తన పాత్రకు డబ్బింగ్ (Dubbing)చెప్పే వాళ్ళు. కానీ మొదటిసారి ప్రభాస్ సినిమా టీజర్ కోసం ఈమె స్వయంగా డబ్బింగ్ చెప్పారని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పినటువంటి కొన్ని ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
సాధారణంగా ఇతర భాష హీరోయిన్లు తెలుగులో నటిస్తే వారి పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెబుతూ ఉంటారు కానీ ఇటీవల కాలంలో హీరోయిన్ల తెలుగుపై కూడా ఆసక్తి చూపుతూ తెలుగు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి పాత్రలకు తెలుగులో స్వయంగా హీరోయిన్లు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ సైతం ప్రస్తుతం టీజర్ కు డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. ఇక ముందు ముందు నిధి అగర్వాల్ నటించే తెలుగు సినిమాలకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెబుతారని స్పష్టమవుతుంది. ఇక ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమాలు నిధి అగర్వాల్ కెరియర్ కు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియాల్సి ఉంది.