Piyush Goyal: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వినియోగించే హెలీకాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే ఈ రోజు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర పర్యటనకు అదే హెలీకాప్టర్‌ని అధికారులు కేటాయించారు. ఇదే హెలీకాప్టర్‌లో తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు పీయూష్ గోయల్ వెళ్లేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.
అయితే పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం రావడంతో కృష్ణపట్నం పర్యటనను వెంటనే రద్దు చేసుకున్నారు. వీఐపీలు ప్రయాణం చేసే హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్యలు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.సీఎం హెలీకాప్టర్ లో టెక్నికల్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పై రిపోర్ట్ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ హెలికాప్టర్‌ను వినియోగించవచ్చా..? లేదా..? అనే దానిపై రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీ అధికారులను కోరారు.
ALSO READ: అంతా కేసీఆరే చేశాడు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలకు వెళ్లేటప్పుడు తరుచూ జీఎంఆర్ సంస్థకు చెందిన హెలికాప్టర్‌ను వాడుతుంటారు. అయితే, ఈ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ఇంటెలిజిన్స్ అధికారులకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: HYDERABAD: ఫుల్‌గా తాగేసి ఒంటెపై.. ఓరి వీడి వేశాలో.. వైరల్ వీడియో