Cucumber Toner: దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దోసకాయలో ఉండే పోషకాలు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి. దోసకాయలో అధిక మోతాదులో నీరు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని చల్లబరుస్తాయి. అంతే కాకుండా హైడ్రేట్ చేస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న దోసకాయతో టోనర్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ టోనర్ ఎలా తయారు చేయాలి ?
కావాల్సినవి:
మధ్య తరహా దోసకాయ- 1
రోజ్ వాటర్- 2 స్పూన్లు
ఒక చిన్న స్ప్రే బాటిల్
తయారీ విధానం:
ముందుగా దోసకాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి.
తర్వాత మిక్సీలో వేసి రుబ్బి రసం తీయండి.
అనంతరం క్లాత్ లేదా ఫిల్టర్ ద్వారా వడకట్టండి.
మీకు కావాలంటే.. ఈ జ్యూస్ లో 2 టీ స్పూన్ల రోజ్ వాటర్ కలపండి.
ఇలా తయారుచేసిన ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో ఉంచండి. దీనిని 5-7 రోజులు ఉపయోగించండి.
ఎలా ఉపయోగించాలి ?
ఈ టోనర్‌ను ముఖానికి రోజుకు 1-2 సార్లు స్ప్రే చేయండి.
దీనిని ఎండ నుండి వచ్చిన తర్వాత లేదా మేకప్ వేసుకునే ముందు కూడా ఉపయోగించవచ్చు.
దోసకాయ రోల్-ఆన్ ఎలా తయారు చేయాలి ?
కావాల్సినవి:
దోసకాయ రసం – 2 టీస్పూన్లు
అలోవెరా జెల్ – 1 టీస్పూన్
రోజ్ వాటర్ – 1 టీస్పూన్
విటమిన్ E క్యాప్యూల్స్ – 1
ఖాళీ రోల్-ఆన్ బాటిల్
తయారీ విధానం:
ఒక గిన్నెలో దోసకాయ రసం, కలబంద జెల్, రోజ్ వాటర్ వేసి బాగా కలపండి.
విటమిన్ E క్యాప్సూల్ పగలగొట్టి అందులో కలపండి. అనంతరం బాగా మిక్స్ చేయండి.
దీన్ని రోల్-ఆన్ బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇది 5-7 రోజులు తాజాగా ఉంటుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఉదయం, సాయంత్రం ముఖం మీద, ముఖ్యంగా కళ్ళ కింద ఉన్న ప్రాంతంలో రాయండి.
ఇది చర్మం తాజాగా చేస్తుంది. అంతే కాకుండా కాంతివంతంగా మారుస్తుంది.
దోసకాయ టోనర్ వల్ల కలిగే ప్రయోజనాలు:
దోసకాయ టోనర్ చర్మానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది సహజమైన astringent గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది . అంతే కాకుండా చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. దోసకాయలో అధిక నీటి శాతం ఉండటం వల్ల ఇది చర్మానికి తక్షణ తేమను అందిస్తుంది. పొడి బారకుండా కూడా నివారిస్తుంది.
Also Read: ఉదయాన్నే ఇలా చేస్తే.. మీ అందం రెట్టింపు
దోసకాయలో ఉండే విటమిన్ సి, కె, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. దీని లోని శీతలీకరణ గుణాలు చర్మంపై ఎరుపుదనం, వాపు, చికాకును తగ్గిస్తాయి. మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను నివారించడంలో కూడా కూడా ఇది సహాయపడుతుంది. దోసకాయ టోనర్ చర్మాన్ని ప్రకాశవంతంగా, తాజాగా ఉంచడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా.. అన్ని రకాల చర్మ రకాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.
Also Read: ఆముదం ఇలా వాడితే.. చర్మం, జుట్టు సమస్యలు అస్సలు రావు !