Homemade Face Toner: ప్రతి ఒక్కరూ మృదువైన, మెరిసే , ప్రకాశవంతమైన చర్మాన్ని ఇష్టపడతారు. తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ ముఖ్యం. ఎందుకంటే ఇది మన చర్మాన్ని ఎల్లప్పుడూ మృదువుగా ఉంచుతుంది. అంతే కాకుండా ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
స్కిన్ కేర్ కోసం మనం క్రీములు ఫేస్ వాష్, స్క్రబ్, ఫేస్ సీరం, మాస్క్ , టోనర్ వంటి వాటిని ఉపయోగిస్తాము. కానీ చాలా మందికి ఫేస్ టోనర్ గురించి తెలియదు. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికి ,మృత కణాలన్నింటినీ శుభ్ర పరుస్తుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్‌ను అందిస్తుంది. ప్రతి ఒక్కరూ టోనర్ వాడటం అలవాటు చేసుకోవాలి. అనేక ప్రయోజనాలు ఉన్న ఫేస్ టోనర్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి టోనర్ :
టోనర్ అనేది మన చర్మాన్ని మేకప్‌కు సిద్ధం చేసి, దానిని జాగ్రత్తగా చూసుకునే ఒక ఉత్పత్తి. కాలుష్యం, దుమ్ము కారణంగా, చర్మ రంధ్రాలు ధూళితో నిండిపోతాయి. ఈ రంధ్రాలను టోనర్ సహాయంతో శుభ్రం చేయవచ్చు. ఇది చర్మం యొక్క pH స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.
బియ్యం నీటితో టోనర్:
బియ్యం నీటితో తయారుచేసిన టోనర్ చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. నిజానికి, బియ్యం నీటిలో ఖనిజాలు, విటమిన్ బి , ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి చాలా మేలు చేస్తాయి.
ఎలా తయారు చేయాలి ?
బియ్యం నీటితో టోనర్ సిద్ధం చేయడానికి, మీకు అర కప్పు బియ్యం అవసరం అవుతాయి. కప్పు బియ్యం తీసుకుని ఈ బియ్యాన్ని శుభ్రమైన నీటిలో నానబెట్టండి. అర గంటలోపు ఈ నీటి రంగు తెల్లగా మారుతుంది. ఈ నీటిని జల్లెడ ద్వారా ఫిల్టర్ చేయండి. మీ బియ్యం నీటి టోనర్ సిద్ధంగా ఉంది . మీరు దీనిని గాజు సీసాలో నింపి స్టోర్ చేసుకోవచ్చు.
చర్మం ప్రకాశవంతంగా మారుతుంది:
ప్రతి రాత్రి పడుకునే ముందు ముఖం వాష్ చేసుకున్న తర్వాత బియ్యం నీటి టోనర్ అప్లై చేయాలి. రాత్రిపూట టోనర్ అప్లై చేసి నిద్రపోవడం వల్ల, దాని ప్రభావం కొన్ని రోజుల్లోనే మీకు కనిపిస్తుంది. అంతే కాకుండా మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి, మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.
విటమిన్ E , B:
బియ్యం నీటి టోనర్ విటమిన్లు E , B లతో నిండి ఉంటుంది. మీరు దీన్ని మరింత మెరుగ్గా చేయాలనుకుంటే మీరు దానిలో అలోవెరా జెల్ , విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలపవచ్చు. ముఖంపై విటమిన్ ఇ మురికిని తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మ రంధ్రాలు శుభ్రపరుస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. జన్మలో జుట్టు రాలదు !
బియ్యం నీటి ప్రయోజనాలు:
బియ్యం నీరు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. ఇది చర్మం ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి ఎలాంటి నష్టాన్ని కలిగించవు. దీనిని తరచుగా వాడటం వల్ల చర్మం యొక్క రంగు మెరుగు పడటం ప్రారంభమవుతుంది.
మొటిమల సమస్యతో బాధపడేవారికి ఇది ఉత్తమమైనది. ఎందుకంటే ఇందులో మొటిమలను తగ్గించే శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి.
ఈ నీటిని ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. నిజానికి ఇందులో చర్మాన్ని బిగుతుగా చేసే అమైనో ఆమ్లం ఉంటుంది.
ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా డ్రై స్కిన్ సమస్యను కూడా తొలగిస్తుంది.